కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత

కర్నూలు ముచ్చట్లు:
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ ల ఆధ్వర్యంలో ఏపీ. జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్యవేదిక కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. ప్రభుత్వం ఇచ్చిన పి.ఆర్.సి తమకు వద్దు అని పాత హెచ్ ఆర్. ఏ జీవో లను అమలు చేయాలని డిమాండ్.. కొత్త జీవో కాపీలను తగలపెట్టారు. అందోళనకు జిల్లావ్యాప్తంగా తరలి వచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఉద్యోగ సంఘాల నాయకులను పోలీసులు అడ్డగించారు. పిఆర్సి అమలుపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని  ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Tension near the Collectorate

Natyam ad