తెరాస ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం
-బీజేవైఎం కార్యకర్తలు అరెస్టు
నల్గొండ ముచ్చట్లు:
కవిత లిక్కర్స్ స్కాం పై బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో బిజేవైఎం కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసారు. మునుగోడు నియోజకవర్గంలో ఈరోజు కేటీఆర్ తో పాటు పలువురు మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేసిన బీజేపి, బిజేవైఎం కార్యకర్తలు గోపీనాథ్,పులకరం సైదులు,పోల రాజు,క్రాంతి, కృష్ణ,సందీప్ లను పోలీసులు అరెస్టు చేసారు.

Tags: Teras government puppet Dagdam
