తెరాసకు న్యాయవ్యవస్థపై నమ్మకం లేదు

Teresa does not believe in the judiciary

Teresa does not believe in the judiciary

Date:12/10/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
తెరాస  కు న్యాయస్థానాలు,  న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదోమో అనిపిస్తుంది. నాలుగున్నర సంవత్సరాలలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఇద్దరు అడ్వకేట్ జనరల్ లు రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక జీవోలను హైకోర్టు కొట్టివేసిందని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో అనేక సార్లు మొట్టికాయలు తిన్న చరిత్ర టిఆర్ఎస్ దే. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభించడం వల్లే టిఆర్ఎస్ పై ఇంత వ్యతిరేకతని అన్నారు.గ్రామపంచాయతీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనదిగా పరిపాలన చేస్తోందని హైకోర్టు తెలిపింది. గ్రామ పంచాయతీల విషయంలో బీజేపీ వాదననే హైకోర్టు వినిపించింది. 1971 నుండి 1981 వరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే సర్పంచ్ ల పదవీకాలం పొడగించారని అన్నారు.
కేసీఆర్ మాత్రం సర్పంచ్ ల పదవీకాలం పూర్తి కాగానే వారి అధికారాలు తొలగించి ప్రత్యేక అధికారులను నియమించారు.  గ్రామాల అభువృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులు తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించలేదని అన్నారు. గ్రామాలపై, గ్రామాల ప్రజలపై టిఆర్ఎస్ ప్రభుత్వానిది సవతితల్లి ప్రేమ. పంచాయతీరాజ్ దివాస్ రోజు ప్రధాని గ్రామాల్లో పాల్గొంటే.. కేసీఆర్ మాత్రం ప్రగతిభవన్ లో పడుకున్నాడని విమర్శించారు. గ్రామసభల్లో సర్పంచ్ కు బదులు టిఆర్ఎస్ నాయకులు అధ్యక్షత వహించేలా కేసీఆర్ ఆదేశించారు. కేసిఅర్ రాత్రికి రాత్రే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించి సవరణలకు ఆమోదించకుండా అమలు పర్చారని అన్నారు.
ఇప్పటికైనా కోర్టు ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్కు సహకరించాలి. రాష్ట్రంలోని తాజా, మాజీ సర్పంచులను బీజేపీ కలిసే  కార్యక్రమం శనివారం నుండి మొదలవుతోందని అయన అన్నారు. అమిత్ షా సభ తర్వాత ఉత్తమ్ మాట్లాడిన మాటలు తన అసహనాన్ని తెలియచేస్తుంది. అమిత్ షా పర్యటనలకు టిఆర్ఎస్ భయపడుతోంది. ఉద్యమంలో పాల్గొన్న యువకులను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉద్యమ ద్రోహులకు పట్టం కడుతున్న టిఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెపుతారు. తెలంగాణ ప్రజలు చైతన్య వంతమైనవారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన టిఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెపుతారు. తలపై మొట్టికాయలు వేద్దామంటే చోటు లేకుండా హైకోర్టు టిఆర్ఎస్ కు మొట్టికాయలు వేసిందని అయన అన్నారు.
Tags:Teresa does not believe in the judiciary

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *