నీవెవరో` టీజర్ విడుదల.. ట్రెమెండస్ రెస్పాన్స్…ఆగస్ట్ 24న గ్రాండ్ రిలీజ్

Teresa Release .. Tremendous Response ... Grand Release on August 24th
Date:16/07/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
మూడు నగరాలు…
రెండు ప్రేమకథలు..
ఒక్క సంఘటన…
ఒక లక్ష్యం…
అంటూ ఆసక్తికరంగా సాగే `నీవెవరో` టీజర్ విడుదలైంది. ఇందులో ఆది పినిశెట్టి అంధుని పాత్రలో నటిస్తున్నారు. కాగా తాప్సీ, రితికా సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అసలు ఆదిపినిశెట్టి రెండు ప్రేమకథలేంటి? తను ఫేస్ చేసిన సంఘటన అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? అనే విషయాలు తెలియాలంటే `నీవెవరలో`సినిమా చూడాల్సిందేనంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ `నీవెవరో`. ఈ సినిమా టీజర్ విడుదలైంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఆగస్ట్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆది పినిశెట్టి పాత్ర.. దాని చుట్టూ జరిగే సంఘటనలు.. దాని ఫలితంగా తనెలాంటి సమస్యలు ఫేస్ చేశాడనే దాన్ని దర్శకుడు హరికృష్ణ ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. “ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశాం. మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఊపుతో ఇప్పుడు టీజర్‌ను విడుదల చేశాం. ఈ టీజర్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు హరినాథ్ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఆది పినిశెట్టికి మంచి బ్రేక్ ఇచ్చే మూవీగా ఇది నిలుస్తుంది. తాప్సీ, రితికా సింగ్ ఇలా ప్రతి ఒక క్యారెక్టర్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.“ అని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.
నీవెవరో` టీజర్ విడుదల.. ట్రెమెండస్ రెస్పాన్స్…ఆగస్ట్ 24న గ్రాండ్ రిలీజ్https://www.telugumuchatlu.com/teresa-release-tremendous-response-grand-release-on-august-24th/
Tags: Teresa Release .. Tremendous Response … Grand Release on August 24th