మార్గరెట్ ఆల్వాకు తెరాస మద్దతు

హైదరాబాద్ ముచ్చట్లు:


భారత ఉప రాష్ట్ర పదవి కి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వా కు  తెరాస మద్దతు తెలిపింది. ఆమెకు మద్దతు ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  నిర్ణయించారు. ఈ నిర్ణయం మేరకు పదహారు మంది టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు మార్గరెట్ అల్వాకు ఓటు వేయనున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు.

 

Tags: Teresa supports Margaret Alva

Leave A Reply

Your email address will not be published.