ఆధార్ అప్ డేట్ లో మారిన నిబంధనలు

Date:09/11/2019

న్యూఢిల్లీ, ముచ్చట్లు:

ఆధార్ అప్‌డేట్ నిబంధనలు మారాయిఆధార్ కార్డు ఉందా? అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. గతంలో మాదిరి ఇప్పుడు అవసరమైనప్పుడల్లా ఆధార్ కార్డులో వివరాలను మార్చుకోవడం కుదరదు. రూల్స్ మారాయి. ఇప్పుడు అప్‌డేట్ నిబంధనలను మరింత కఠినతరమయ్యాయి.యూఐడీఏఐ తాజాగా ఆధార్ అప్‌డేట్ నిబంధనలను మార్చేసింది. పేరు, పుట్టిన తేదీ, జెండర్ వంటి అంశాలకు సంబంధించి రూల్స్ కూడా మారాయి. దీంతో ఈ సమాచారాన్ని మార్చుకోవడం అంత సులువు కాదు. వీటికి కూడా పరిమితులు ఉన్నాయి. అవేంటో చూద్దాంఆధార్ కార్డులో ఇప్పుడు పేరును కేవలం 2 సార్లు మాత్రమే మార్చుకోగలరు.ఇకపోతే ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కేవలం ఒకేసారి మార్చుకోగలం.అలాగే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో తొలిగా రికార్డైన పుట్టిన సంవత్సరానికి మూడేళ్లు పైకి లేదా కిందకు మాత్రమే మార్చుకోగలం.పుట్టిన తేదీ మార్చుకోవడానికి కచ్చితంగా డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలి. లేదంటే మార్చుకోవడం వీలు కాదు.జెండర్ వివరాలను కూడా కేవలం ఒకేసారి అప్‌డేట్ చేసుకోగలం.లిమిట్ దాటి మార్పు చేసుకోవాలంటే యూఐడీఏఐ రీజినల్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే పరిమితి దాటిన తర్వాత కూడా మళ్లీ ఆధార్ అప్‌డేట్‌ ఎందుకు అవసరమైందో తెలియజేస్తూ help@uidai.gov.in కు మెయిల్ పంపాలి.మీరు చెప్పిన రీజన్‌కు రీజినల్ ఆఫీస్ ఓకే చేస్తే.. మీ రిక్వెస్ట్ ఎన్‌లోన్‌మెంట్ సెంటర్‌కు వెళ్లిపోతుంది. ఆధార్ వివరాలు అప్‌డేట్ అవుతాయి.

 

రైతు భరోసా అందని రైతులు నిరాశ చెందవద్దు

 

Tags:Terms changed in Aadhaar update

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *