ఆర్మీ క్యాంప్పై ఉగ్ర దాడి..

-ముగ్గురు జవాన్లు మృతి… ఇద్దరు ముష్కరులు హతం

శ్రీనగర్ ముచ్చట్లు:


స్వతంత్ర వేడుకల నేపధ్యంలో ఉగ్రదాడులు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలు నిజమయ్యాయి. జమ్ముకశ్మీర్ రాజౌరీలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్లోని సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. గురువారం వేకువజామున ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు హోరాహోరీ పోరు జరిగింది. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. హతమైన ముష్కరుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. ఘటనా నేపధ్యంలో భద్రతా సిబ్బంది విస్తృత సోదాలు జరుపుతున్నారు.

 

Tags: Terror attack on army camp

Leave A Reply

Your email address will not be published.