వీసా లేకుండానే థాయ్‌లాండ్
థాయ్‌లాండ్ ముచ్చట్లు:
విదేశాలను సందర్శించాలని అనుకునే వారికి తీపి కబురు చెప్పింది థాయిలాండ్ సర్కార్. తమ దేశానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి వీసాలు అక్కర్లేదని పేర్కొంది. టూరిజం అభివృద్దిలో భాగంగా ఈ వెసులు బాటు వచ్చే ఏడాది 2024 మే నెలాఖరు వరకు వర్తింప చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

భారత దేశం తో పాటు తైవాన్ నుండి వచ్చే ప్రయాణీకులకు వీసా అవసరాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన రాయబారి ఓ ప్రకటనలో తెలిపారు. 30 రోజుల పాటు ఉండేందుకు వీలుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ డేటా ప్రకారం జనవరి నుండి అక్టోబర్ 29 వరకు దాదాపు 29 మిలియన్ల మంది థాయ్ లాండ్(Thailand) ను సందర్శించారు. దీని ద్వారా ఆ దేశానికి పర్యాటక రూపేణా 927.5 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది.
భారతదేశం తో పాటు మరో ఆరు దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని మరో దాయాది దేశం శ్రీలంక కూడా ప్రకటించింది ఇటీవలే. మరో వైపు థాయ్ లాండ్ ను చైనా, మలేషియా, దక్షిణకొరియాతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు థాయ్ లాండ్ ను సందర్శించారు.
ఈ ఏడాది 28 మిలియన్ల రాక పోకలను లక్ష్యంగా పెట్టుకుంది ఆ దేశ పర్యాటక శాఖ. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తెలిపారు.
Tags: Thailand without a visa
