తంబళ్లపల్లెకు గండికోట నీరు

– ఒక ఎత్తిపోతల పథకం, 100 కిలోమీటర్ల పైపులైన్‌ ద్వారా తరలింపు
– చెరువులు, కొత్తగా చేపట్టబోయే పథకాలకు నీటి తరలింపు
– సమగ్ర సర్వేకోసం రూ.6 కోట్లు కావాలని ఆర్థికశాఖకు నివేదిక
– జలవనరుల ముఖ్యకార్యదర్శి అదిత్యానాథ్‌దాస్‌, మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

Date:22/10/2019

బి.కొత్తకోట ముచ్చట్లు:

జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి గండికోట జలాసయం నుంచి నీటిని తరలించే సరికొత్త ప్రణాళిక కార్యరూపం దాల్చుతోంది. దీనికి సంబంధించిన చర్యలు మంగళవారం సచివాలయంలో చర్యలు వేగంగా సాగాయి. సచివాలయంలోని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, జలవనరులశాఖ ఎస్‌ఈ సురేంద్రనాథ్‌రెడ్డి గంటికోట జలాలను తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరుకు తరలించేందుకు ఉద్ధేశించిన కొత్తపథకంపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి, ఎస్‌ఈ సురేంద్రనాథరెడ్డిలు జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శిని ఆయన కార్యాలయంలో క లిసి ఈ పథకం గురించి సమీక్షించారు. హాంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు పూర్తి స్తాయిలో వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికి గండికోట నుంచి నీటిని తరలించడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయన్న విషయంపై చర్చించారు. ఈ పథకం కార్యరూపం దాల్చడం కోసం వైఎస్సార్సీపి లోక్‌సభపక్ష నేత పివి.మిథున్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని , దీనికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అంగీకారం తెలిపారని ఆదిత్యనాథ్‌దాస్‌ అన్నారు. దీనిపై తదుపరి చర్యలతో ముందుకువెళ్తామని పేర్కొన్నారు. కాగా మంగళవారం రోజే ఈ పథకానికి సంబంధించి సమగ్రసర్వే, డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ రూపకల్పన కోసం రూ.6 కోట్లు మంజూరు చేయాలంటు జలవనరులశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది. దీనికి త్వరలోనే ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి.

ఎత్తిపోతులు, పైపులైన్‌తో…

గాలేరు -నగిరి ప్రాజెక్టులో భాగమైన కడపజిల్లా కొండాపురం మండలంలోని గండి జలాశయం నుంచి 1080క్యూసెక్యుల సామార్థ్యంతో నీటిని తరలించడం కోసం జనవరులశాఖ ప్రణాళిక సిద్దం చేసింది. అందులో గండి కోట నుంచి 56 కిలో మీటర్ల వరకు గ్రావిటి ద్వారా నీటిని వేంపల్లె మండలం పాములూరు వరకు తరలిస్తారు. అక్కడే ఎత్తిపోతల పథకం నిర్మిస్తారు. తరువాత లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, గాలివేడు, పెద్దమండ్యం మండలాలు మీదుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని హంద్రీనీవా ప్రాజెక్టుకు చెందిన తంబళ్లపల్లె ఉపకాలువ 407 కిలో మీటరు వద్ద కాలువలోకి నీటిని తరలిస్తారు. ఈ పైపులైన్లు 340 క్యూసెక్యుల సామార్థంతో ఏర్పాటు చేస్తారు. అలాగే హంద్రీనీవా ప్రధానకాలువ 470 కీలో మీటరు వద్ద 740 క్యూసెక్యుల సామార్థ్యం నీటిని మళ్లిస్తారు. ఇలా గండికోట నుంచి 12 టిఎంసిల నీటిని వాడుకోవాలి అన్నది ఈ పథకం ఉద్ధేశం.

రెండు విధాల ప్రయోజనం…

హంద్రీనీవా ద్వారా జిల్లాకు 10 టిఎంసీల నీరు దక్కాల్సి ఉంది. ఈ ఏడాది జనవరి 21 నుంచి ఏప్రిల్‌ 11 వరకు కృష్ణాజలాలు పారించినా చేరింది 750 ఎంసిఎఫ్‌టిల నీరే. కనీసం ఒక టిఎంసీ కూడ దక్కలేదు. ఈ పరిస్థితులలో కృష్ణాజిలాలు జిల్లాలోకి 120 రోజులు పారించిన రెండు టిఎంసీలకు మించి నీరు వచ్చే అవకాశం లేదని అంచనా. ఈ పరిస్థితులలో గంటికోట నుంచి నీటిని తరలించే పథకం పూర్తి చేస్తే జాప్యంలేకుండ నీటిని తరలించుకునే వీలుంది. ఈ నీరు హంద్రీనీవాతో సంబంధం లేకుండ అదనంగా సాధించినట్లు అవుతుంది. ప్రస్తుతం ప్రతిపాదిత లక్ష్యం మేరకు గండికోట నుంచి తరలించే జలాలు చెరువులకు పూర్తి స్తాయిలో నింపాలన్నది లక్ష్యం, దీనికి తోడు కొత్తగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొత్తగా రెండు రిజర్వేయర్లు, పుంగనూరు నియోజకవర్గంలో ఒక రిజర్వేయర్‌ నిర్మించి, నీటిని నింపాలన్నది కొత్తప్రతిపాదన ఉంది. దీని ద్వారా చెరువులు నిండిపోతే , హంద్రీనీవా ద్వారా అందే కృష్ణాజలాలు ఆయకట్టు భూములకు సాగునీరు అందించవచ్చు అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది.

వేరుశెనగ అధిక దిగుబడి

Tags: Thamballapalle Gondicotta Water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *