Thank you for making JanataKerfu a success

జనతాకర్ఫ్యూను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

Date:22/03/2020

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరులో జనతాకర్ఫ్యూను విజయవంతం చేసేందుకు కృషి చేసిన వారికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కృత జ్ఞతలు తెలిపారు. ఆదివారం పట్టణంలో ప్రజలు, వ్యాపారులు స్వచ్చందంగా ఇండ్లలో ఉండిపోయి కరోనా నియంత్రణ చర్యలకు సహకరించారు. దీనిపై వైఎస్‌ఆర్‌సీపీ జెడ్పీమాజీ ప్లోర్‌లీడర్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం మాట్లాడుతూ కరోనా నివారణకు కమిషనర్‌ కెఎల్‌.వర్మ, సీఐ గంగిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది , పోలీసులు చేసిన కృషి అభినందనీయమన్నారు. వ్యాదిని నియంత్రించేందుకు అవసరమైన ప్రతి సారి ఇదే విధంగా అందరు ఐకమత్యంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, నాగరాజారెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, ఫకృద్ధిన్‌షరీఫ్‌, అమరేంద్ర, అమ్ము, కిజర్‌ఖాన్‌, రాజశేఖర్‌రెడ్డి, సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

జనగణమనతో పుంగనూరుకు గుర్తింపు

Tags: Thank you for making JanataKerfu a success

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *