కబడ్డీ విజయవంతానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు- ఎమ్మెల్యే భూమన
– కోవిడ్ నిబంధనలు చక్కగా పాటించాం
– మేయర్, కమిషనర్
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు జాతీయస్థాయి కబడ్డీ పోటీలను దిగ్విజయంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు . తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ , ప్రాచీన క్రీడ కబడ్డీని అఖిల భారత ఆహ్వాన పద్ధతి లో విజయవంతం గా ముగించామన్నారు. రాష్ట్ర పురపాలేక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తిరుపతిని క్రీడా క్షేత్రంగా తీర్చిదిద్దడంలో నగరపాలక సంస్థ జాతీయస్థాయి కబడ్డీ గోల్డ్ కప్ పోటీలు నిర్వహించి, రాష్ట్రంలో నే మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఈ క్రీడల స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంతాల్లో ఆదరణ ఉన్న క్రీడలను ప్రోత్సహించాలని ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించడం ముదావహమన్నారు. ఏ స్థాయి క్రీడలునిర్వహించినా టిటిడి ప్రోత్సహించడంలో ముందుంటుందని చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించడం గర్వకారణం అన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులు, ద్రోణాచార్య, అర్జున అవార్డు గ్రహీతలు పుల్లెల గోపీచంద్, హోసన్న గౌడ్, రాజరత్నం, కరణం మల్లీశ్వరి లు అంతర్జాతీయ పోటీలు తలపించేలా ఏర్పాట్లు చేయడం పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలిపారాణి కరుణాకర్ రెడ్డి వివరించారు. ఇంత పెద్ద ఎత్తున పోటీలకు సహకరించిన పుర ప్రజలు, వ్యాపార సంఘాలు, ఆసుపత్రుల యాజమాన్యాలు, వివిధ క్రీడా ఔత్సాహిక సంఘాలు, స్వచ్చంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు యాజమాన్యాలకు అభినందనలు తెలిపారు.
కోవిడ్ నిబంధనలు పాటించాం – మేయర్
అఖిల భారత ఆహ్వాన కబడ్డీ టోర్నమెంట్ నిర్వహణలో కోవిడ్ నిబంధనలు పాటించామని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా అన్నారు. జాతీయ క్రీడాకారులకు వసతి సదుపాయం కల్పించిన టిటిడి శ్రీనివాసం, మాధవంలో రోజువారీ సానిటైజేషన్ చేయించామన్నారు. క్రీడాకారులకు మాస్కులు, సానీతైజర్లు నగరపాలక సంస్థ చే సరఫరా చేశామన్నారు. త్రాగునీరు కూడా ప్రత్యేకంగా బాటిల్స్ క్రీడామైద్దానంలో ఏర్పాటు చేశామన్నారు.
నగరంలో వ్యక్తిగత భద్రత తప్పనిసరి- కమిషనర్
నగర ప్రజలు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉందని కమిషనర్ గిరీషా ప్రజలను విజ్ఞప్తి చేశారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో కూడా క్రీడాకారులకు, సహచరులకు అందరికి కూడా పరిక్షలు నిర్వహించామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించామన్నారు. మూడవ వేవ్ రానున్న నేపథ్యంలో నగర ప్రజలు మాస్కులు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags; Thank you to everyone who contributed to the success of Kabaddi- MLA Bhumana