అభిమానానికి ఫిదా.. ఆంధ్రా యువకుడికి కేటీఆర్ ధన్యవాదాలు

Thank you to Katrite for the Andhra youth

Thank you to Katrite for the Andhra youth

Date:08/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. రైతుబంధు, కళ్యాణ లక్ష్మీ, మిషన్ భగీరథ లాంటి సంక్షేమ పథకాలతో కేసీఆర్‌కు ఆంధ్రలోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఏపీ ప్రజల్లోనూ సదాభిప్రాయం ఉంది. కేసీఆర్ విజయవాడ వెళ్లినప్పుడు.. అక్కడ భారీ స్థాయిలో వెలిసిన కటౌట్లే దీనికి నిదర్శనం. తాజాగా ఓ ఆంధ్ర యువకుడు కేసీఆర్‌పై తన అభిమానం చాటుకున్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ.. ఏపీకి చెందిన రోహిత్ కుమార్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేపట్టాడు. నెల్లూరుకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి గులాబీ దుస్తుల్లో టీఆర్ఎస్ జెండాతో కాలినడకన హైదరాబాద్ బయల్దేరాడు. కేటీఆర్‌ను విపరీతంగా అభిమానించే రోహిత్ తన గుండెలపై ఆయన రూపాన్ని టాటూగా వేయించుకోవడం విశేషం.
Tags:Thank you to Katrite for the Andhra youth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *