సత్తుపల్లి ప్రజల చిరకాల కోరిక తీర్చిన  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ధన్యవాదాలు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి    ముచ్చట్లు:

హైదరాబాదులో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సత్తుపల్లిలో సకల సౌకర్యాలతో ,100 బెడ్ లతో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య  ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నిర్మితమై ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి 1978 వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించారని ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాన్ని మంజూరు చేయాలని పూర్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి కోరగా, సత్తుపల్లి ప్రజల చిరకాల వాంఛ 100 బెడ్ ల నూతన భవనాన్ని మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా వినియోగించుకోవాలని సూచించినట్లుగా తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల కోసం సత్తుపల్లి వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిని అభివృద్ధి పథంలో నిలిపామని సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామని అత్యాధునిక సౌకర్యాలతో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసి సేవలు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  తెలిపారు.

కరోనా రోగులకు వైద్యం అందించడంలో భాగంగా సత్తుపల్లి, పెనుబల్లి మండల కేంద్రాల్లో నియోజకవర్గ ప్రజల కోసం 100 పడకలతో ఆక్సిజన్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేసి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని, ఆసుపత్రి నందు రెమిడి సివర్ ఇంజక్షన్, మందుల కొరత లేకుండా వైద్య సౌకర్యాలు సహాయ సహకారాలను అందించామని, కరోనా రోగులకు రెండు పుట్ల పౌష్టికాహారాన్ని అందించామని నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఇసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల సహకారంతో వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి సహకారాన్ని అందించామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ప్రతి రోజూ 100 మినరల్ వాటర్ బాటిల్ ను అందించామని, కరోనా తీవ్రత తగ్గే వరకు కూడా ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ అందించేందుకు సింగరేణి సి.ఎం.డి తో మాట్లాడి ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా నియోజకవర్గంలో రోజుకు 3500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వంతో మాట్లాడి ఆదేశాలు జారీ చేయించామన్నారు. కరోనా నియంత్రణకు చర్యల్లో భాగంగా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి కఠినమైన చర్యలుతో రాకపోకలు నిలిపివేసి, లాక్ డౌన్ నిబంధనలు, గ్రామా స్థాయి ఆశ వర్కర్లు వైద్యుల పర్యవేక్షణలతో  38 శాతం ఉన్న నమోదు రేటును 6.11 శాతానికి తగ్గించగలిగామన్నారు. నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాన్ని ఇచ్చిందని లక్షణాలు అనుమానం ఉన్న వారికి 6500 మెడికల్ కిట్లు ఇచ్చి కరోనాని అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

Tags:Thanks to Chief Minister Kalwakuntla Chandrasekhar Rao for fulfilling the long cherished wish of the people of Sattupalli
Sattupalli legislator Sandra Venkata Virayya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *