క్యాబినెట్ హోదా ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు

క్యాబినెట్  హోదా ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు

కడప ముచ్చట్లు:

Post Midle

రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కు క్యాబినెట్ హోదా కల్పించినందుకు ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి,
కృతజ్ఞతలు తెలిపారు. కడప పట్టణంలోని ఆర్టీసీ చైర్మన్ కార్యాలయంలో కలిసిన పాత్రికేయులతో చైర్మన్ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూఆర్టీసీ చైర్మన్ గా నియమించబడి 8 నెలలు అయిందని, తిరిగి చైర్మన్ పదవికి క్యాబినెట్  హోదా కల్పించడం సంతోషంగా ఉందన్నారు .ఆర్ టి సి సంస్థ తరఫున, ఉద్యోగుల,  కార్మికుల తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు .
ఆర్టీసీ కార్మికులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలని కోరడం జరిగింది, ఆ మేరకే ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేయడంతో ఆర్టీసీ సంస్థముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికిఎంతో రుణపడి ఉందన్నారుపూర్వ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని లాభాల బాటలో పయనించే విధంగా గా అప్పుడే 500 కోట్ల రూపాయలు కేటాయించగా,1000 బస్సులు కొనుగోలు  చేయడం జరిగిందన్నారు. అనంతర పరిస్థితిలో ఆర్టీసీ తీవ్ర సంక్షోభంలో  కి నెట్టబడిందని, అయినా జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ సంస్థ నష్టాల బాటలోనే ఉందని ప్రభుత్వం జీతాల రూపంలో ప్రతినెల 300 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు ఇంకా రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వమే ఆర్టీసీకీ, సహకరించడం, నిజంగా గా ఆర్టీసీ సంస్థ అదృష్టమే అన్నారు.

 

 

సంస్థ నష్టాల నుండి కృషి చేసి
లాభాల బాటలో పయనించేందుకు ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు కార్మికులు అందరూ కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం కడప ఆర్టీసీ
బస్టాండ్ కేవలం 18 ఫ్లాట్ పారా
లతో, ఉందని, వీటిని 34 ప్లాట్ ఫారాల తో నూతన బస్టాండ్ నిర్మించేందుకు
ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చైర్మన్ తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో  ఖాళీ గా ఉన్న స్థలంలో అత్యంత సుందరంగా కడప జిల్లా ప్రజలకు ఉపయోగపడే రీతిలో మల్టీప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపినట్లు ఆయన వివరించారు, ప్రస్తుతం తొమ్మిది కోట్ల రూపాయలతో నూతన గ్యారేజీ ఆర్ఎం ఆఫీస్ ఆధునీకరణ పనులు చేస్తున్నట్లు, సిబ్బంది నివాస ప్రాంతాల్లో సిసి రోడ్లు ఇతర పనులు నిర్మాణాలు చేపట్టినట్లు, 20 ఎలక్ట్రికల్ బస్సులు కడప జిల్లాకు రానున్నాయని
వాటిని ప్రధాన పట్టణాలకు తిప్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు, కడప కమలాపురం ఖాజిపేట మీదుగా ప్రస్తుతం నడుస్తున్న బస్సును రైల్వే స్టేషన్ టైమింగ్ ప్రకారము నడిపేందుకు కృషి చేస్తామన్నారు.

 

Tags: Thanks to CM YS Jagan for giving me cabinet rank

Post Midle
Natyam ad