కొవిడ్  వ్యాక్సిన్ పై మోడీకి థాంక్స్  -బీజేవైఎం

ఎమ్మిగనూరు  ముచ్చట్లు:
పట్టణంలో  భారతీయ యువ మోర్చా  (బీజేవైఎం) ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపుమేరకు ఈ వ్యాక్సిన్  వేసే ప్రతి కేంద్రం దగ్గర  ఈ  కార్యక్రమాన్ని నిర్వహించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.   ఈ  సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు  సావాది రఘునాథ్ మాట్లాడుతూ ఈ  కార్యక్రమం  లో ఏమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో  ఆరు వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర  ఎన్టీఆర్ కాలనీ, సంజీవయ్య నగర్, ప్రభుత్వ ఆస్పిటల్, దైవందిన్నె గ్రామం, గోనెగండ్ల మండలం, నందవరం మండలలో  నిర్వహించడం జరిగింది అని ఆయన అన్నారు అదే విధంగా కోవిడ్ 19 విస్తరించకుండా టీకాలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వేయించుకోవాలి అని అదేవిధంగా బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు,  దరించాలని మరియు దేశం మొత్తానికి ఫ్రీ కొవిడ్ -19 వ్యాక్సిన్స్ అందిస్తున్న మన శ్రీ నరేంద్ర మోడి గారికి ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల్, s నవీన్, రఘు, నరసింహులు, వీరేంద్ర తదితర నాయకులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

Tags:Thanks to Modi on Kovid vaccine -BJYM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *