CM KCR Review on Agriculture

నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

Date:14/07/2020

చొప్పదండి  ముచ్చట్లు:

హైదారాబాద్ లోని ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  పిలుపుతో కరీంనగర్ జిల్లా చొప్ప దండి నియోజక వర్గం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశంలో చొప్ప దండి నియోజక వర్గంలోని సాగునీటి గురించి చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు ఎల్లంపల్లి నీటితో చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్ రిజర్వాయర్,మైసమ్మ చెరువు,పోతారం రిజర్వాయర్,ఫాజుల్ నగర్ చెరువు నింపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసారని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  కృతజ్ఞతలు తెలిపారు.రైతులు అడకముందే రైతుల అవసరాలను గుర్తించి నీటిని విడుదల చేయాలని కోరగానే విడుదలకు ఆదేశాలు జారీ చేసినందుకు చొప్ప దండి నియోజక వర్గ టీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు రైతులు ధన్యవాదాలు తెలిపారు.రెండు రోజుల్లో నారాయణపూర్ జలాశయానికి చేరుకుంటాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.

తెలంగాణలో కరోనా పాలిటిక్స్

Tags: Thanks to the Chief Minister for issuing orders for the release of water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *