Natyam ad

బీజేపీ కి మద్దతిచ్చిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు-ఎంపి డాక్టర్ లక్ష్మణ్

న్యూఢిల్లీ ముచ్చట్లు:

కేసీఆర్ సర్కారుకు ఉపాద్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని బీజేపీ రాజ్యసభ సభ్యులు , పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.  బీఆర్ఎస్,  కమ్యూనిస్టుల అసహజ కలయికను తిప్పికొట్టారని, తెలంగాణ సమాజంలో కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకతకు ఈ ఫలితాలు నిదర్శనం అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కేసీఆర్ సర్కారు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ ఎన్నికల ఫలితాలు వచ్చాయని కనుమరుగవుతోన్న కమ్యూనిస్టులు ఉనికి కోసం కేసీఆర్ కు మద్దతునిచ్చి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారని, కమ్యూనిస్టు లను తెలంగాణ సమాజం వెలేసిందన్నారు. 317 GO తో పాటు ఉపాధ్యాయుల ను కేసీఆర్ సర్కారు రాచి రంపాన పెట్టిందని దుయ్యబట్టారు. తెలంగాణ సమాజం కేసీఆర్ సర్కారును కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని ఈ ఫలితాలు అందుకు నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ పోరాటాలు కొనసాగుతాయని , నిరంకుశ కేసీఆర్ సర్కారును కూల్చి మోడీ గారి నేతృత్వంలో డబల్ ఇంజిన్ సర్కారు తీసుకురావడం ఖాయమని డాక్టర్ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.

 

Post Midle

Tags; Thanks to the teachers who supported BJP – MP Dr. Laxman

Post Midle