Natyam ad

ముస్లింల ఇస్తిమాకు సహకరించిన వారికి కృతజ్ఞతలు

పుంగనూరు ముచ్చట్లు:


పట్టణంలో రెండు రోజుల పాటు నిర్వహించిన ముస్లిం ఇస్తిమా కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిలకు ముస్లిం ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం అంజుమన్‌ కమిటి అధ్యక్షుడు ఎంఎస్‌.సలీం , మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌ లు కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్‌.సలీం మాట్లాడుతూ ఇస్తిమా విజయవంతం అయ్యేందుకు ప్రభుత్వంలోని అన్నిశాఖల వారు తమకు ఎంతగానో సహకరించారన్నారు. అలాగే మంత్రి పెద్దిరెడ్డి 20 ఎకరాల స్థలంలో ఇస్తిమా నిర్వహించేందుకు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, ప్రోత్సహించారని కొనియాడారు. ఇస్తిమాకు సహకరించిన ప్రతి ఒక్కరి సేవలకు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్‌ కమిటి కార్యదర్శి ఇబ్రహిం, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, ముస్లిం నాయకులు న్యామత్‌, జాఫర్‌ఖాన్‌, ఆసిఫ్‌, ఆరిఫ్‌, సాద్‌, తాజ్‌, నూరుల్లా తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Thanks to those who contributed to the faith of Muslims

Post Midle
Post Midle