విడాకులు అందుకే ఇచ్చా

ముంబై ముచ్చట్లు:

బాలీవుడ్ హీరోయిన్‌ శిల్పా శెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తొలిసారి తన మాజీ భార్య విషయమై ఓపెన్ అయ్యారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత తన మొదటి భార్య కవితతో విడిపోవడానికి గల కారణాలు చెబుతూ గుట్టువిప్పారు. కవితతో తాను విడిపోవడానికి కారణం శిల్పాశెట్టి అంటూ వైరల్ అవుతున్న వార్తలను ఖండించిన ఆయన.. తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ అసలు విషయం బయటపెట్టారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.కవిత తన చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని, సీక్రెట్‌గా ఎఫైర్ నడిపించిందని రాజ్ కుంద్రా ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం తాము లండన్‌లో ఉన్నపుడు తన చెల్లెలు, ఆమె భర్త తమతోనే ఉండేవారని.. అలా కవితకు తన చెల్లెలి భర్త దగ్గర కావడం తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. తాను బిజినెస్ ట్రిప్స్ కోసం వెళ్లినప్పుడు వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం వచ్చిందని, ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్ కూడా చెప్పారని కుంద్రా అన్నారు.దీంతో తన చెల్లెలు, ఆమె భర్తను ఇండియా పంపించామని.. అయినప్పటికీ అతనితో కవిత కమ్యూనికేట్ అవుతూనే ఉండేదని కుంద్రా తెలిపారు. రహస్యంగా ఓ సెల్‌ఫోన్ తీసుకొని అతనికి తరుచూ మెసేజ్‌లు చేసేదని చెప్పారు. ఒకానొక సమయంలో తన చెల్లెలు కాల్ చేసి.. తన భర్త సీక్రెట్‌గా వాడుతున్న ఓ ఫోన్ దొరికిందని, అందులో యూకే నంబర్‌ నుంచి సందేశాలు ఉన్నాయని చెప్పడంతో డౌట్ వచ్చి ఇంట్లో వెతకగా బాత్‌రూమ్‌లో కవిత దాచిన సెల్ ఫోన్ కనిపించడంతో షాకయ్యానని రాజ్ కుంద్రా చెప్పారు.అందులో మెసేజ్‌లు చూసి తన గుండె ముక్కలైందని, దాంతో కవిత నుంచి విడాకులు తీసుకున్నాను తప్ప ఇందులో శిల్ప ప్రమేయం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు రాజ్ కుంద్రా. తన గురించి అన్నీ తెలిసే శిల్పా శెట్టి తనను ప్రేమించి పెళ్లిచేసుకుందని ఆయన అన్నారు

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:That is why divorce is granted

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *