Natyam ad

ఆ భూమి మాదే సర్వహక్కులు మాకే ఉన్నాయి

దౌర్జన్యకారులను ఖాళీ చేయించండి

27 మంది రైతుల డిమాండ్

ఖమ్మం ముచ్చట్లు:

Post Midle

సర్వహక్కులు ఉన్న ఆ 31.7 ఎకరాల భూమి తమదేనని, అక్రమంగా దౌర్జన్యకారులు తమను బెదిరించి ఆ భూమిని స్వాహా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని బాధిత 27 మంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామానికి చెందిన బాధిత రైతులు గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు గత 30 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. వెలుగుమట్ల గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 147, 148, 149 లలో 31.7 ఎకరాల భూమి తమ తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్నామన్నారు. వంశపారంపర్యంగా సంక్రమించిన ఆ భూమిపై దౌర్జన్యకారులకు ఎలాంటి హక్కు లేదన్నారు. గత 3 సంవత్సరాల నుండి కొంతమంది దౌర్జన్యకారులు మహిళలను తమపై ఉసిగొలిపి ఆ భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నంం చేస్తున్నారన్నారు. తమను బెదిరించి అక్రమంగా గుడిసెలు వేసుకొని ఉంటున్నారన్నారు.

 

 

 

ఈ విషయమైతాము హైకోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా కోర్టు స్పందించిందన్నారు. గతంలో ఖమ్మం కలెక్టర్ ను కలిసి విన్నవించగా ఆ భూమి 27 మంది రైతులకు చెందుతుందని చెప్పినప్పటికీ దౌర్జన్యకారులు అక్రమంగా ఆక్రమించుకోవడంతో తాము కోర్టును ఆశ్రయించామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు సంబంధిత అధికారులు కల్పించుకొని ఆ భూమి నుండి దౌర్జన్య కారులను ఖాళీ చేయించి తమకు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు. ఈ సమావేశంలో షేకు గోరెమియా జానీ మియా వెంకటరత్నం బి వెంకన్న బుచ్చి రాములు నాగమణి రామస్వామి తదితరులు మాట్లాడారు.

 

Tags: That land is ours and we have all the rights

Post Midle

Leave A Reply

Your email address will not be published.