అన్నారం, సంగెమ్ ఐ కే పి సెంటర్లపై రైతుల అందోళన

సూర్యాపేట  ముచ్చట్లు:
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని అన్నారం, సంగెమ్ ఐ కే పి సెంటర్లు పట్టపగలే రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. క్వింటాల్ కు 10 కిలోల తరుగు తీస్తామని బెదిరిస్తున్నారని వారు అంటున్నారు. క్వింటాల్ కు డ్రైవర్ బేటా రు. 10,హమాలి కూలీ రు. 39 ముక్కుపిండి రైతులవద్ద ముందే గుంజుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. క్వింటాల్ కు 10 కిలోల తరుగుకు ఒప్పుకోకపోతే ధాన్యం వాపస్, దాన్యాన్ని తూకం వేసి లారీ లోడ్ ఐన తర్వాతకూడా రైతుకు రషీదులు ఇవ్వడంలేదని రైతులు విమర్శిస్తున్నారు. నిర్వాహకుల పై రైతులుకలెక్టర్, ఆర్ డి ఓ లకు పిర్యాదులు ఇచ్చారు. కిలో ధాన్యం కూడా తరుగు తీసెయ్యకుండా పూర్తి డబ్బులు ఇప్పించాలని, అక్రమంగా వసూల్ చేసిన డ్రైవర్ మామూళ్లు వాపస్ ఇప్పించాలని పిర్యాదు చేసారు. కలెక్టర్, ఆర్ డి ఓ, పి డి లు బాధ్యులపై బాడీ్యులపై కొరడా ఝలిపించాలని, ఈ పట్టపగలు దోపిడీ ఆపాలని వారు అన్నారు. సూర్యాపేట కలెక్టర్,ఆర్ డి ఓ ల కార్యాలయాల ముందు రైతుల ఆవేదన వ్యక్తం చేసారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:That said, farmers’ concern over Sangem IKP centers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *