Natyam ad

ఆ సామాజిక వర్గం వైసీపీకి దూరం

గుంటూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి, ఏ సామాజిక వర్గాన్ని జనానికి దూరం చేసి లబ్ధి పొందుదామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో ఆ ప్రయోజనం చేకూరలేదు, ఆ లబ్ధి ఒనగూరలేదు సరి కదా.. మూడేళ్ల జగన్ పాలనలో మూటగట్టకున్న అపఖ్యాతి అంతా ఒకెత్తు అయితే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో ఆయన మూటగట్టుకున్న అపఖ్యాతి మరొక ఎత్తు అన్నట్లుగా  ఉంది.పరిశీలకుల విశ్లేషణల మేరకు జగన్ సర్కార్ ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల మనోభావాలనూ దెబ్బతీశారు. ముఖ్యమంత్రి కనుక ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒకరిద్దరు మంత్రులూ, నలుగురైదుగురు ఎమ్మెల్యేలూ, మరి కొంత మంది వైసీపీ నేతలూ ట్వీట్ల ద్వారానో, మీడియా మందు మాట్లాడారేమో కానీ.. వైసీపీలో అత్యధికులు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. యార్లగడ్డ రాజీనామా, వల్లభనేని వంశీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ నిర్ణయంపై పునరాలోచించాలని  జగన్ కు సూచించడం, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలను ధిక్కరించి మరీ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.ఎవరు ఔనన్నా కాదన్నా ఎన్టీఆర్  ఒక సామాజిక వర్గానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయనో మహానుభావుడు, యుగపురుషుడు. తెలుగు వాడిని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిన వ్యక్తి. రాజకీయ నాయకుడిగా ఆయన సమాజిక వైద్యం చేశారు. ఆయన రాజకీయ ప్రవేశం వరకూ వెనుకబడి ఉన్న బీసీ వర్గాలు రాజకీయంగా ఉన్నత పదవులు అందుకోవడానికి సోపానమయ్యారు. మధ్య తరగతి జీవులకు బతుకు భరోసా అయ్యారు. పేదవారికి నోటికాడ అన్నం ముద్దగా మారారు. అందుకే రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ కు అన్ని వర్గాలలోనూ అభిమానులున్నారు. దైవాంశ సంభూతుడిగా ఆరాధించే వారు కోకొల్లలుగా ఉన్నారు.

 

 

 

Post Midle

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీకి మరణశాసనం రాసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల మాట పక్కన పెడితే ప్రభుత్వ నిఘా వర్గాలు కూడా అదే చెబుతున్నాయి. ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం తరువాత జగన్ గ్రాఫ్, వైసీపీ గ్రాఫ్ గతంలో ఎన్నడూ లేనంతగా దిగజారిపోయిందంటున్నారు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలోనూ కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సటీ పేరు మార్పు అధికార పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటున్నారు. జగన్ ఆశించినట్లుగా సామాజిక వర్గాల వారీగా మద్దతు, వ్యతిరేకతగా విడిపోలేదనీ, జనం ముక్త కంఠంతో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారనీ నిఘావర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారని తెలుస్తోంది. ప్రధానంగా గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహం వ్యక్తం అవుతున్నదని అంటున్నారుగత అసెంబ్లీ ఎన్నికలలో జగన్ పార్టీ విజయం వెనుక ఈ జిల్లాలలో వీచిన అనుకూల పవనాలు ఉన్నాయనీ, ఇప్పుడవి వ్యతిరేక పవనాలుగా కాక వ్యతిరేక ప్రభంజనంలా మారే అవకాశం ఉందనీ నిఘావర్గాలు చెబుతున్నాయి. బీసీలను ఒక సామాజిక వర్గానికి దూరం చేయాలన్న దురాలోచనతో తీసుకున్న హెల్త్ వర్సిటీ మార్పు బూమరాంగ్ అయ్యిందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. బీసీలలోనే ఎక్కువగా ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం పట్ల ఆగ్రహం, వ్యతిరేకతా వ్యక్త మౌతోందంటున్నారు. ఇప్పుడు నష్ట నివారణ కోసం ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టామంటూ వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నించినా అది చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందమే అవుతోందని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.

 

Tags: That social group is far from YCP

Post Midle

Leave A Reply

Your email address will not be published.