అప్పుడే మ్యాజిక్ ఫిగర్ లెక్కలు

విజయవాడ  ముచ్చట్లు:


వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పోలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తుంది…ఇప్పుడు ఏదో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సెపరేట్ గా రాజకీయం చేస్తున్నట్లు ఉన్నారు గాని…ఎన్నికల ముందు మాత్రం వీరు కలవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఎందుకంటే వీరు విడివిడిగా పోటీ చేస్తే వారికే నష్టం…అదే కలిసి పోటీ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. విడిగా పోటీ చేస్తే ఏం అయిందో గత ఎన్నికల్లోనే రుజువైంది…ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది.ఈ సారి కూడా అలాగే జరిగితే…మళ్ళీ అధికారం వైసీపీదే…అందుకే వైసీపీని అధికారం నుంచి దూరం చేయడానికి బాబు-పవన్ పొత్తు దిశగానే ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన డిమాండ్ చేస్తుంది…కానీ ఈ డిమాండ్ కు టీడీపీ ఏ మాత్రం ఒప్పుకోదు…అవసరమైతే సింగిల్ గానే పోటీ చేస్తామని అంటుంది. అయితే ఈ విషయంలో పవన్ కాస్త వెనక్కి తగ్గుతారనే తెలుస్తోంది.ఎందుకంటే జనసేన సింగిల్ గా పోటీ చేసి అధికారంలోకి రాలేదు..

 

 

 

ఏదో సింగిల్ గా 10 లోపు సీట్లు మాత్రమే గెలుచుకోగలదని సర్వేలు చెబుతున్నాయి. అలాంటప్పుడు వైసీపీకి గాని, టీడీపీకి గాని మ్యాజిక్ ఫిగర్ సీట్లు రాకుండా ఉండవు. కాబట్టి జనసేన ఖచ్చితంగా పొత్తు ఉంటే లాభం ఉంటుంది..అటు పొత్తు వల్ల టీడీపీకి లాభమే.అయితే పొత్తు పొట్టుకుంటే సీఎం సీటు అడిగే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ సీఎం సీటు అడిగితే…టీడీపీ పొత్తు పెట్టుకోదు. కాబట్టి పవన్ కు సీఎం అయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇక ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఒకవేళ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా తీసుకోరు…ఎందుకంటే ఒక సీఎం క్యాండిడేట్ మంత్రిగా చేయడం జరగని పని. కాబట్టి బాబు కోసం…పవన్ ఎమ్మెల్యేగానే ఉండిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

 

Tags: That’s when the magic figure is calculated

Leave A Reply

Your email address will not be published.