Natyam ad

అందుకే అంటారు ..ఆచితూచి మాట్లాడాలని..

హైదరాబాద్   ముచ్చట్లు:

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఇప్పుడు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. ఇందుకు కారణం ‘నాటు.. నాటు..’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ అవార్డు రావడమే. ప్రతిష్టాత్మకమైన అవార్డుతో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా తెలుగు సినిమా ఘనత విశ్వవ్యాప్తమైందని పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. RRR.. టీమ్‌కు ప్రముఖుల విషెస్‌తో సోషల్ మీడియా మోతెక్కిపోతోంది. బండి సంజయ్ కూడా ఆస్కార్ రావడంపై స్పందించారు. నాటు.. నాటు పాట ఆస్కార్ గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతూ RRR మూవీ చిత్ర యూనిట్‌కు బండి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం దేశ సినిమా చరిత్రకే గర్వకారణమని.. అందులో ప్రత్యేకంగా తెలుగువారికి ఎంతో గర్వకారణమన్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రదర్శన అద్భుతం అని సంజయ్ ట్వీట్ చేశారు. ఇలా బండి ట్వీట్ చేశారో లేదో.. ఇక ట్రోలింగ్స్ ఓ రేంజ్‌లో మొదలయ్యాయి. సినీ ప్రియులు, తెలుగు ప్రేక్షకులు.. ఇతర పార్టీల కార్యకర్తలు బండి సంజయ్ ఇదివరకు ఆర్ఆర్ఆర్ మూవీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇంతకీ బండి ఏమన్నారు..?
‘ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్‌ను కించపరిచేలా తెరకెక్కిస్తున్నారు. కొమురంభీమ్‌కు టోపీ పెట్టడమేంటి..?. చరిత్రను కించపరిచేలా ఉంది. టోపీ మార్చకుంటే సినిమా థియేటర్లను తగలబెడతాం. ఓవైసీకి బొట్టుపెట్టి కాషాయ కండువా కప్పుతారా..?. నిజాం ఫొటోకు బొట్టుపెట్టి దండ వేయగలరా..?. కొమరంభీమ్‌కు టోపీ పెట్టడంపై ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొమురం భీమ్ మనవడు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలను తొలగించకపోవతే సినిమాను రిలీజ్ కానివ్వం. బిడ్డా రాజమౌళి.. నువ్వు గనుక సినిమా విడుదల చేస్తే.. నిన్ను బడిసెలతో కొట్టి పంపిస్తాం. థియేటర్ల యజమానులను కూడా హెచ్చరిస్తున్నా. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రతీ థియేటర్‌ను కాల్చేస్తాం. ఎవ్వరినీ వదిలిపెట్టం. దేశం కోసం పోరాడిన వారితో కుప్పిగంతులేపిస్తారా..?’ అంటూ బండి సంజయ్ ఓ రేంజ్‌లో ఊగిపోయి తెగ వార్నింగ్‌లు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడీ సినిమాకు ఆస్కార్ వచ్చేసింది. దీంతో బండి టోన్ కూడా మారిపోయింది.. నాడు మాట్లాడిన మాటలన్నీ మరిచిపోయి ఆస్కార్ అవార్డు రావడం సంతోషంగా ఉందని.. ఇది గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు.
మీ మాటలకు భయపడి ఉంటే..!
బండి మాట్లాడిన పాత వీడియోను బయటికి తీసిన నెటిజన్లు..‘ ఇదిగో సారు తమరి మాట్లాడిన మాటలు ఓ సారి విని తరించండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాడు బీజేపీ నేతలు చేసిన మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సాధించేదా..? భారత్ పేరు, తెలంగాణ పేరు ప్రపంచ వేదికపై మారుమోగేదా..? అంటూ బండిని ఆయన వీడియోతోనే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఇంతలోనే ఎంత మార్పు బండన్నా.. ఏదైతేనేం తప్పు తెలుసుకున్నారుగా సంతోషమే..’ అని కొందరు సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

Post Midle

‘మంచి జరిగితే జై కొట్టాలి.. లేకపోతే తిట్టాలి.. ఇదేనా మీ తీరు..?’ అని బీజేపీయేతర కార్యకర్తలు తిట్టిపోస్తున్నారు. ‘ పాపం.. ఎందుకో తమరు విమర్శించినవన్నీ గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయ్ కదా బండన్నా..’ అంటూ ఇంకొందరు ఆర్ఆర్ఆర్ వీరాభిమానులు నవ్వుకుంటూ ఎమోజీలతో హోరెత్తిస్తున్నారు. అయితే.. ఆస్కార్ వచ్చిన తర్వాత మొట్ట మొదట.. ‘RRR సినిమా రిలీజ్ చేస్తే కొట్టి సంపుతం.. థియేటర్లు తగలవెడుతం అన్నాడు ఆనాడు.. ఈ రోజు ఆస్కార్ సాధించింది సినిమా, మనోడి మొఖచిత్రం ఏంటో ఇప్పుడు ..’ అని ట్వీట్స్ మొదలయ్యాయి. బండి రియాక్ట్ అయిన తర్వాత ఇక కామెంట్ల మోతే మోగింది. ఇక మీమర్స్‌కు అయితే బండి మంచి కిక్కిచ్చేశారని చెప్పుకోవచ్చు. సో.. ఇకపై ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిదేమోనని బండికి నెటిజన్లు సూచిస్తున్నారు.

Tags;That’s why they say.

 

Post Midle