2018 పంట నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి

Date:22/10/2020

తుగ్గలి  ముచ్చట్లు:

2018 సంవత్సరానికి సంబంధించిన పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సిపిఐ మరియు ఎఐకెఎస్ నాయకులు డిమాండ్ చేశారు.మండల కేంద్రమైన తుగ్గలిలో గురువారం రోజున అతివృష్టి వలన దెబ్బతిన్న పంట పొలాలకు పంట నష్ట పరిహారం అందజేయాలని సిపిఐ నాయకులు ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయంకు తాళం వేసి ధర్నా ను నిర్వహించారు.ఈ సంవత్సరం అధిక వర్షాల వలన రైతులు తీవ్రంగా నష్టపోయారని, వెంటనే ప్రభుత్వం రైతులకు నష్ట పరిహారాన్ని అందజేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పార్లమెంటులో ఆమోదించిన రైతు వ్యతిరేక బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు తెలియజేశారు. నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోని రైతులకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నబి రసూల్, సిపిఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు,మండల సహాయ కార్యదర్శి సుల్తాన్,ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షులు మస్తాన్,సిపిఐ శాఖ కార్యదర్శులు మద్దిలేటి మునిస్వామి రాముడు,రైతు సంఘం సహాయ కార్యదర్శి రామానాయుడు,పిరా మరియు రైతులు తదితర నాయకులు పాల్గొన్నారు.

షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ ఎమ్ భాషా కు  ఘన సన్మానం

Tags: The 2018 crop compensation should be credited to the farmers ’accounts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *