ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 520వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం
-అన్నమాచార్య కళామందిరంలో ఆకట్టుకున్న సంకీర్తనల గోష్ఠిగానం
తిరుపతి ముచ్చట్లు:
శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 520వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నపూర్ణ బృందం గాత్ర సంగీతం, ఉదయం 11.30 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారిణి సుశీల బృందం గాత్ర సంగీత సభ జరిగింది.సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన రాధ బృందం గాత్ర సంగీత సభ నిర్వహించనున్నారు.

మహతిలో :
మహతి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ వెంకటేశ్వర్లు భాగవతార్ హరికథ పారాయణం చేయనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు హరనాథ్ భరతనాట్యం ప్రదర్శించనున్నారు.ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టుసంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పాల్గొన్నారు.
Tags; The 520th birth anniversary celebrations of Sri Thallapaka Annamayya have started grandly
