నిందితుడికి నాలుగుసంవత్సరాలు జైలు శిక్ష

The accused has been sentenced to four years in jail

The accused has been sentenced to four years in jail

Date:12/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

హత్యయత్నం కేసులో నిందితుడికి నాలుగు సంవత్సరాల కఠిన కారగార శిక్ష, రూ.1500 లు జరిమాన విధిస్తూ అసిస్టెంట్‌ సెసన్స్ జడ్జి బాబునాయక్‌ తీర్పు ప్రకటించారు. పుంగనూరు మండలం వనమలదిన్నెకు చెందిన గురుమూర్తి అనే యువకుడు పుంగనూరుకు చెందిన బాలికపై ఫిబ్రవరి నెల 15న పుంగనూరులో రాత్రి 8 గంటల సమయంలో దాడి చేసి, హత్యాప్రయత్నం చేశాడు. దీనిపై బాలిక ఫిర్యాదు మేరకు పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి, చార్జ్షీటు దాఖలు చేశారు. ఈ కేసు పూర్వాపరాలను అడిషినల్‌ పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ ఆకుల చెన్నకేశవులు కోర్టుకు వివరించి, నిందితుడికి శిక్ష విధించాల్సిందిగా కోరారు. కేసులోని వాదప్రతివాదనలను, సాక్షులను విచారించి, న్యాయమూర్తి బాబునాయక్‌ నిందితుడికి నాలుగు సంవత్సరాల కఠిన కారగాశిక్ష, రూ.1500లు జరిమాన విధించారు.

నానబియ్యం బతుకమ్మకు వాయనం

Tags: The accused has been sentenced to four years in jail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *