నిందితులకు  కనువిప్పు కావాలి

The accused need to look up

The accused need to look up

పోలీసులకు అండగా టాలీవుడ్

Date:06/12/2019

అమరావతి ముచ్చట్లు:

దిశ’ కేసులో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న నలుగురు నిందితులు శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో మరణించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఈ నలుగురిని నడిరోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేశారు. దిశకు మద్దతుగా సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అంతా రోడ్లపైకి వచ్చి నినదించారు. దిశకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి చేకూరినట్టయిందని అంతా అంటున్నారు.ఇప్పటికే ఈ ఎన్‌కౌంటర్‌పై సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేశారు. ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటనను విడదుల చేశారు.‘‘దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగా ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు మూసుకుపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ‘దిశ’ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న ‘దిశ’ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది.ఆడపిల్లల్ని ఆటవస్తువుగా పరిగణించి వారిపై దారుణమైన ఆకృత్యాలకు పాల్పడే మానవ మృగాలకు ఇదో గుణపాఠం కావాలి! ఇటువంటి అత్యాచార సంఘటనలు పునరావృత్తం కాకుండా నేరస్థుల వెన్నులో వణుకు పుట్టాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. సజ్జనార్ గారి లాంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్న పోలీస్ వ్యవస్థకి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా నా అభినందనలు’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

 

డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ

 

Tags:The accused need to look up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *