Natyam ad

మార్గదర్శి కార్యకలాపాలపై ఈడి విచారణ జరిపించాలి

రాజమండ్రి ముచ్చట్లు:

 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తో దర్యాప్తు జరిపించాలని ఏపీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్ చేశారు.రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..చిట్స్‌కు సంబంధించి గతంలో రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఇచ్చిన సమాచారాన్ని సీఐడీ అధికారులకు పంపుతున్నానని,ఏపీ చిట్‌ఫండ్‌ యాక్ట్‌ 14(2) ప్రకారం సేకరించిన.. నగదు మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని,కానీ, మార్గదర్శిలో అలా జరగలేదని ఉండవల్లి వెల్లడించారు.చట్ట విరుద్ధంగా డిపాజిట్‌దారుల సొమ్మును మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారని,మార్గదర్శిలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయని, 2008లోనే వట్టి వసంత్‌కుమార్‌ ఫిర్యాదు చేశారని,మార్గదర్శి ఫైనాన్స్‌ షేర్‌పై నేను కేసు పెట్టే సమయానికి..1,360 కోట్ల నష్టాల్లో ఉందని ఉండవల్లి వెల్లడించారు.సంస్థ నుంచి కనీస సమాచారం కూడా అధికారులకు ఇవ్వడం లేదని,రామోజీ సెలబ్రిటీ కాబట్టి ఇప్పటిదాకా చర్యలు చేపట్టలేదని,మార్గదర్శి చిట్స్‌లో జరిగే అవకతవకలపై ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని అన్నారు.

Post Midle

Tags;The activities of the guide should be investigated by the ED

Post Midle