ఆధార్ కు అవస్థలు ఇంతింత కాదయా…

The aftershocks of Aadhaar are not ...

The aftershocks of Aadhaar are not ...

Date:20/09/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
 ఆధార్, మీ సేవ కేంద్రాల వద్ద ఆధార్‌ కార్డులో మార్పులు, సవరణలు చేసేవారు. ఆధార్‌ కేంద్రాల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసిన ఆధార్‌ విభాగాల వద్ద సర్వర్‌లు తరచూ మొరాయిస్తుండటంతో  అక్కడకెళ్లేవారు పడిగాపులు కాయాల్సి వస్తోంది.  ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆధార్‌ సేవలను పొందాలనుకునేవారు 40 నుంచి 50 మంది ఒక్కొక్క కేంద్రం వద్ద  బారులు తీరుతున్నారు.
అయితే ఒక్కో కేంద్రం వద్ద 15 దరఖాస్తులు మాత్రమే అందజేసి ఆరోజు వాటా అయిపోయిదంటూ మిగిలిన వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఆధార్‌ కార్డులో మార్పులు చేయించుకోవాలని వచ్చిన వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు. కొంతకాలంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో ఆధార్‌ సేవలను నిలిపివేశారు. జిల్లాలో కేవలం రెండు మీ సేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్‌ సేవలను కొనసాగిస్తున్నారు.
ఈ రెండు కేంద్రాలను కూడా జిల్లా కలెక్టర్‌ చొరవతోనే సాగుతున్నాయి. జిల్లాలోని పలు పోస్టాఫీసులు, పలు బ్యాంక్‌లలో ప్రత్యేకంగా ఆధార్‌ సేవా విభాగాలను ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా కేంద్రంలోని గాంధీబొమ్మ సమీపంలో సండే మార్కెట్‌ వద్ద, నెల్లూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఆధార్‌ కేంద్రాలు కొనసాగుతుండేవి. సండేమార్కెట్‌ వద్ద ఉన్న కేంద్రాన్ని నిలిపివేశారు.
తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న ఆధార్‌ కేంద్రాన్ని సమీపంలోని ఎస్‌బీఐలోకి మార్పు చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద మాత్రమే ఆధార్‌ సేవలు అరకొరగా అందుతున్నాయి.  ఒకే కుటుంబంలో వారికి రెండు, మూడు దరఖాస్తులు కావాల్సిన వారు పనులను వదులుకుని పదే పదే కౌంటర్ల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు.
ఇటీవల వివిధ కులాలకు చెందిన వారికి సబ్సిడీ రుణాలను మంజూరు చేశారు. వీరికి ప్రస్తుతం ఉన్న చిరునామాతో ఆధార్‌ కలిగి ఉండాలి. చాలమందికి గతంలో నివాసం ఉన్న చోటే ఆధార్‌ ఉంది. ప్రస్తుతం చిరునామా ప్రకారం ఆధార్‌లో సవరణ చేసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సకాలంలో సవరణలు జరిగితే తప్ప బ్యాంక్‌లలో డాక్యుమెంటేషన్‌ కార్యకలాపాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది.
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి నగదు, బ్యాంక్‌లలో జమ అయ్యేందుకు అకౌంట్లు ఓపెన్‌ చేసుకునేందుకు ఆధార్‌ ఫింగరింగ్‌ తప్పనిసరిగా మారింది. హైస్కూల్‌  విద్యార్థులకు ఈ సమస్య ఇబ్బంది కలిగిస్తోంది.చిన్నతనంలో తీసిన ఆధార్‌తో సంబంధం లేకుండా ప్రస్తుత ఫింగరింగ్‌ను నమోదు చేయాలనే నిబంధన విద్యాశాఖలో, బ్యాంకుల్లో నెలకొని ఉంది.
ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి ప్రైవేటు పాఠశాలలో తరగతికి ఇద్దరు చొప్పున ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంపిక చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపుతారు.. ఆధార్‌ ఫింగరింగ్‌ ఉంటే తప్ప బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడం వీలుకాదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు.  ఆధార్‌ కౌంటర్ల వద్ద తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడంలేదు.
Tags:The aftershocks of Aadhaar are not …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *