-ధాన్యం కొనుగోలు కేంద్రాలను యధావిధిగా కొనసాగించాలి
-పాడిపరిశ్రమను ప్రోత్సహించాలి
-సంక్రాతిని రైతుదినోత్సవంగా జరపాలి
-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Date:15/01/2021
జగిత్యాల ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు, యువతకు ఉపాధి లభించాలనే సదుద్దేశంతో
యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలనీ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 70శాతం వ్యవసాయంపై ఆధారపడ్డారని, వ్యవసాయానికి అనుబంధంగా అనాదిగా ప్రతి ఇంటిలో పాడి పశువులు ఉండేవని గుర్తుచేశారు. హిందువులకు సంక్రాంతి పెద్దపండుగ అని చెబుతూ వివిధ రాష్ట్రాల్లో సంక్రాంతిని రకరకాల పేర్లతో పిలుచుకుంటారని అన్నారు. శుక్రవారంజగిత్యాల మండలం పోరండ్లలో కనుము పండుగ వేడుకలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులు, నాయకులుకుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరిపారు.
ఈసందర్బంగా లక్ష్మారెడ్డి కి చెందిన గోవులకు పూజచేసి వాటికీ పండ్లు, దాన తినిపించి ఎడ్ల బండిని తోలారు. పోరండ్లలో జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సంక్రాతి పండుగను రైతు దినోత్సవంగా ప్రకటించాలని, ఉత్తమ రైతులను సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్న సుభిక్షంగా ఉండాలంటే ఆర్థికంగా ఎదగడానికి
ప్రభుత్వం వ్యవసాయరంగంతో పాటు పాడిపరిశ్రమను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. ఆహారధాన్యాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకునే పరిస్థితినుంచి అధిగమించడానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు బహుళార్ధసాధక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయ రంగానికి అధిక అధిక ప్రాధాన్యతనిచ్చారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రతి ఇంటికి 50 శాతం రాయితీ, 50 బ్యాంక్ రుణంతో ఒక పాడిపశువు ఇవ్వాలన్నారు. పాడి పశువులు మృతి చెందితే ఇన్సూరెన్స్ కంపెనీ అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఏడాది గడిచిన దాని స్థానంలో మరో పశువును ఇవ్వకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు పాల ఉత్పత్తిలో నష్టం జరిగిందని పేర్కొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఎత్తివేతను కెసిఆర్ పునరాలోచన చేయాలని, వాటిని యధావిధిగా కొనసాగించాలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీ తో చేసుకున్న రహస్యఒప్పందంతో రాష్ట్ర రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టంలో కనీస మద్దతు కల్పించి చట్టాన్ని సవరణ చేయాలనీ ఢిల్లీలో చలిలో రైతులు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. అనాడు 70వేల కోట్లతో యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయాగ, నేడు మోడీ ప్రభుత్వం కేవలం పదుల సంఖ్యలో పెట్టుబడి దారులకు 2 లక్షల కోట్ల రుణం మాఫీచేసిoదని విమర్శించారు. కేంద్రప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తుందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు,
ప్రజావ్యతిరేకవిధానాలు అవలంభిస్తున్నాయని, దీంతో ఉద్యమాలు తప్పేట్లు లేదని చెప్పారు.ఉత్తర తెలంగాణలో కోతుల బెడద తీవ్రంగాఉందని, కోతులు పంటలను నాశనంచేస్తున్నాయని చెబుతూ కోతులపునరుత్పత్రి నిలిపివేసేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాష్ట్ర జీవనరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనుము పండుగ రోజున పశువులను ఆరాధించడం హిందూ సంప్రదాయమని కాంగ్రెస్ రైతు విభాగం పక్షాన పోరండ్ల లోని పాడిపశువులను పూజించామని తెలిపారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి ని రైతులు సన్మానించారు. ఈకార్యక్రమంలో నాయకులు బండ భాస్కర్ రెడ్డి, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి, చందా రాధాకిషన్, జున్ను రాజేందర్, రాంచంద్రారెడ్డి, బాలక్రిష్ణ రెడ్డి, చంద్రాకృష్ణా రెడ్డి, బాస ప్రకాష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
సదుంలో శ్రీ అయ్యప్పస్వామికి అభరణాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి , ఎంపీ మిధున్‌రెడ్డి
Tags: The agricultural sector should be linked to employment