కేంద్ర ప్రభుత్వ సాయం అంతంత మాత్రమే 

The aid of the central government is only marginal

The aid of the central government is only marginal

Date:05/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని మండిపడ్డారు. మిషన్ కాకతీయ, మిషన్ బగీరథ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఓ వైపు ప్రశంసిస్తున్నారని… మరోవైపు రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించడం లేదని… నిధులను విడుదల చేయడం లేదని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఉనికి లేదనే ఈ విధంగా చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదని… ఇప్పటికైనా బీజేపీ తన తీరును మార్చుకోకపోతే, పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు.తెలంగాణ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా… కేంద్రం పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల ఒక రీతిలో… బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల పట్ల మరో రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం వ్యవహారశైలి బాధాకరమని చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Tags:The aid of the central government is only marginal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *