ప్రతి ఇంటికీ లబ్ది చేకూర్చడమే ధ్యేయం

చౌడేపల్లె ముచ్చట్లు:


ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా కృషిచేస్తున్నామని ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ దామోదరరాజు తెలియజేశారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కెంగనపల్లె, బి.కదిరేపల్లె, పంచలింగాల కొత్తూరుతోపాటు పరికిదొన పంచాయతీలోని పలు గ్రామాల్లో ఇంటింటా పర్యటించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లపాలనలో లబ్దిచేకూరిన పథకాలను ప్రజలకు వివరించారు. సమస్యలను ఆలకిస్తూ వాటిని పరిష్కరిస్తూ పర్యటన కొనసాగింది.సచివాలయ వ్యవస్థతోపాటు ప్రజలకు నేరుగా ఇంటికే పథకాలు అందుతున్నాయని అలాంటి ప్రభుత్వానికి మరోమారు దీవించి అండగా ప్రజలు నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పిఏ ముని తుకారం, మాజీ ఎంపీపీలు రుక్మిణమ్మ, రెడ్డిప్రకాష్‌, వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, కో ఆప్షన్‌మెంబరు సాధిక్‌భాషా, సర్పంచ్‌లు హైమావతి, లక్ష్మిదేవమ్మ,వరుణ్‌భరత్‌, అల్తాఫ్‌, ఎంపీటీసీ శ్రీరాములు, సర్పంచుల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మహమ్మద్‌షఫీ,రవికుమార్‌రెడ్డి,గిరిరెడ్డి, కృష్ణారెడ్డి, జీవన్‌రెడ్డి, రెడ్డెప్ప, రంగనాథ్‌, చంద్ర,గోవిందు,నాగరాజ, గణపతిరెడ్డి,చెంగల్రాయప్ప,తదితరులున్నారు.

 

Tags: The aim is to benefit every household

Leave A Reply

Your email address will not be published.