The aim is to develop on the lines of tourism - Minister Peddireddy's ambition

టూరిజం తరహాలో అభివ్యృధ్దే ధ్యేయం- మంత్రి పెద్దిరెడ్డి ఆశయం

– బోయకొండను సందర్శించిన మంత్రి సోద రుడు పెద్దిరెడ్డి
– దశలవారీగా అభివృద్దిపనులు పూర్తిచేయాలని ఆదేశాలు
-పిఆర్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో బోయకొండలో పరిశీలన
– పార్క్,మౌళిక వసతుల ఏర్పాట్లుకు చర్యలు

Date:18/9/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

జిల్లాలో నాల్గవ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయంను అత్యంత సుందరంగా,ఆదర్శంగా పర్యటక క్షేత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్దిశాఖమంత్రివర్యులు డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. మంత్రి ఆదేశాలమేరకు మంత్రి సోదరుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి శుక్రవారం బోయకొండలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. మంత్రిగాబాధ్యతలు స్వీకరించినప్పటినుంచి బోయకొండ గంగమ్మ భక్తుడిగా బోయకొండలో అభివృద్ది కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిసారించి దశల వారీగా నిధులు మంజూరుచేయిస్తూ పనులను నాణ్యతా ప్రమాణాల తో పూర్తిచేయించడానికి స్వీకారం చుట్టారు. కోట్లాది రూపాల నిధులతో భక్తులకు అవసరమైన మౌళిక వసతులు, సదుపాయాలు, భవనాల ఏర్పాటుతో పాటు బోయకొండను అత్యంత సుంధరంగా తీర్చిదిద్దడమే కాకుండా భక్తులకు ఆహ్లాదకరమై వాతావరణంను తలపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈక్రమంలో బోయకొండలో పార్క్ తరహాలో అభివృద్దికి పంచాయతీరాజ్‌ డిఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఈఈ వెంకటేశ్వర్లు, ఇంజనీరింగ్‌శాఖ అధికారులతో కలిసి బోయకొండలో చేపట్టబోయే పనులపై చర్చించారు. మౌళిక సదుపాయాలు, భక్తులకు సౌకర్యంగా షాపింగ్‌ మాల్స్, తాగునీరు, గ్రీనరీ, చెట్లుపెంపకం,బోయకొండ వద్ద పచ్చగడ్డి ఏర్పాటుచేసి పార్క్ తరహాలో అభివృద్దికి స్వీకారం చుట్టారు. ఈమేరకు ఈవో చంద్రమౌళితో కలిసి స్థలాన్నిపరిశీలించి అంచనాలు సిద్దం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. మరోవైపు కోట్లాది రూపాయాలతో జరుగుతున్న అభివృద్దిపనులను త్వరగా పూర్తిచేసి దసరా మహ్గత్సవాల్లో మంత్రిపెద్దిరెడ్డిచే ప్రారంభోత్సవం చేసేలా చూడాలని కాంట్రాక్టర్‌లు శ్రీధర్‌రెడ్డి, లడ్డూరమణలకు సూచించారు.ఆయన వెంట మాజీ ఎంపీటీసీ పద్మనాభరెడ్డి ఏఎంసీ డైరక్టర్‌ రవిచంద్రారెడ్డి తదితరులున్నారు.

198 మందికి కోవిడ్‌ నిర్థారణ పరీక్షలు

Tags:The aim is to develop on the lines of tourism – Minister Peddireddy’s ambition

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *