గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ఐటీడీఏ పిఓ గోపాలకృష్ణ రోణంకి

విశాఖపట్నంముచ్చట్లు :

 

పాడేరుఏజెన్సీలో పటిష్టమైన మలేరియా నివారణ చర్యలు చేపట్టి గిరిజనులకు మెరుగైన వైద్యసేవాలందించడమే లక్ష్యంగా పనిచేయలని ఐటీడీఏ పిఓ గోపాలక కృష్ణ రోనాంకి ఆదేశించారు. విడులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.సోమవారం ఐటీడీఏ కార్యాలయం నుండి 11మండలాల వైద్య అధికారులు ఎంపిడివోలు తహశీల్దార్ లు మలేరియా విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది జూన్ నెలకు ఈ సంవత్సరం జూన్ నెల ఆకరితో పోలిస్తే మలేరియా కేసులు తీవ్రత 57 శాతం తగ్గిందన్నారు.జులై 1వ తేదీ నుండి ఏజెన్సీలో 1545మలేరియా ప్రభావిత గ్రామాల్లో రెండవ విడత దోమల మందు పిచికారి పనులు ప్రారంబిస్తున్నామని అన్నారు.గ్రామ వాలింటార్లు,స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తో దోమల మందు పిచికారి పనులు చేపట్టాలి అన్నారు. ఎంపిడివోలు తహశీల్దార్ లు ప్రత్యేక చొరవ తీసుకొని దోమల మందు పిచికారి పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. దోమల మందు పిచికారి షెడ్యూలు ఇప్పటికే మండల అధికారులకు పంపించమని చెప్పారు.
గ్రామ సచివాలయాలకు సంబంధిత షెడ్యూలు ప్రతిని పంపించాలని సూచించారు.గ్రామాలకు దోమలమందు పిచికారి పై ముందుగానే సమాచారం పంపించాలని స్పష్టం చేశారు.దోమల మందు పిచికారి పనులు పూర్తి అయ్యేవరకు సెలవులు రద్దుచేసమన్నారు దోమ తెరల వినియోగం పై గిరిజనులకు అవగాహనా కలిగించాలని అన్నారు.మండల స్థాయి అధికారులు సంబంధిత మండలాల నుండి మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావలి ఆదేశించారు.తక్తపుతాల సంఖ్యను పెంచి జాప్యం చేయకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

 

Tags:The aim is to provide better healing to the tribals
ITDA PO Gopalakrishna Ronanki

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *