Dr Peddi Reddy Ramachandra Reddy, Minister

పుంగనూరు ప్రజలకు తాగునీరు-సారునీరు అందించడమే ఆశయం

– మంత్రి పెద్దిరెడ్డి వెల్లడి

Date:15/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని ప్రజలందరికి తాగునీరు, రైతాంగానికి సాగునీరు అందించడమే ప్రధాన ఆశయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శులు అక్కిసాని బాస్కర్‌రెడ్డి, కొండవీటి నాగభూషణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్‌, విశ్వనాథ్‌, పెద్దిరెడ్డి, సివి.కుమార్‌, ఎంఎస్‌.సలీం. పి.అయూబ్‌ఖాన్‌, ఫకృద్ధిన్‌షరీఫ్‌ , అమ్ము, ఆవుల అమరేంద్ర అతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. మంత్రి వారిందరికి పార్టీ కండువాలు వేసి , పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల మ్యానిపెస్టోలోని నవరత్నాలను అన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. మిగిలిన ఒకే ఒక పథకం ఉగాధి పండుగ రోజున ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని 25 లక్షల మందికి గృహాలు నిర్మించే కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సీఎం జగన్‌ జరిపిన చర్చలు త్వరలోనే ఫలితాన్నిస్తుందన్నారు. కెసిఆర్‌ సూచించిన మేరకు రాయలసీమ ప్రాంతంలో అవసరమైన ప్రాంతాలలో రిజర్వాయర్లు నిర్మించి, సాగునీరు, తాగునీరు అందజేస్తామన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలకు, ప్రలోభాలకు లోనుకావద్దని మంత్రి సూచించారు. అధికారంలోకి వస్తునే పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని, ఇచ్చిన మాట మేరకు నియోజకవర్గంలో ఆర్టీసి డిపో, సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు, మండల కార్యాలయాల పక్కా భవనాల నిర్మాణాలు, గ్రామీణ ప్రాంతంలోని అన్ని వీధుల్లోను సిమెంటు రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టి, ఆదర్శంగా నిలిచామన్నారు. తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామిలను పూర్తి చేసి , తిరిగి ఎన్నికలకు వస్తానని , అమలు చేయపోతే ఎన్నికల్లోకి రానని స్పష్టం చేశారు. ప్రజలందరు పట్టుదలతో అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్సీపికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మనోహర్‌, రేష్మా, మంజుల, ఈశ్వర్‌రెడ్డి, జి.చంద్రశేఖర్‌రెడ్డి, ఆవుల హరిప్రసాద్‌, కిట్టా , రామ్మోహన్‌రెడ్డి, మంజుల, తులసెమ్మ, సుబ్బమ్మ, జయక్రిష్ణ, షకీల, రషీద, రాఘవరెడ్డి, ఖాదర్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Tags: The aim is to provide drinking-water to the people of Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *