– మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
– పదివేల మందికి పైగా హాజరు
– 23 కంపెనీలలో నియామకం
Date:23/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి కల్పించడమే ఆశయంగా జాబ్‌మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు శనివారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఓఎస్డి దుర్గాప్రసాద్ , కమిషనర్ కెఎల్.వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళా కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప , తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ముఖ్యఅతిధులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి కంపెనీ కేంద్రాలకు వెళ్లి చర్చించారు. అలాగే హెల్ఫ్‌లైన్ డెస్క్‌లు, వైద్య శిభిరాలను , మెప్మాబజారును, వసతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు మనోధైర్యంతో ఉద్యోగాలలో పనిచేయాలన్నారు. అర్హతను బట్టి కంపెనీలలో తగిన వేతనము, తగిన పని కల్పించేలా కంపెనీ యజమానులతో చర్చించామన్నారు. ప్రస్తుతం హాజరైన నిరుద్యోగులలో 2500 మందికి మాత్రమే నియామకాలు అందజేస్తున్నామన్నారు. మిగిలిన వారికి కూడ రెండవ దశలో త్వరలోనే జాబ్‌మేళా నిర్వహించి, నిరుద్యోగులకు తగిన భరోసా ఉండేలా ఉద్యోగ నియామకాలు చేపడుతామన్నారు. ఎవరు అధైర్య పడకుండ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పోకల అశోక్‌కుమార్, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, పెద్దిరెడ్డి, కొండవీటి నాగభూషణం, అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఉపాధిహామి రాష్ట్ర కౌన్సిలర్ ముత్తంశెట్టి విశ్వనాథ్, పంచాయతీరాజ్ రాష్ట్ర కౌన్సిలర్ అంజిబాబు, మాజీ జెడ్పిటిసి వెంకటడడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, పార్టీజిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
నియామకపు పత్రాలు …
జాబ్‌మేళాలో ఎంపికైన నిరుద్యోగులకు నియామకపు పత్రాలను మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. 23 కంపెనీలలో ఎంపికైన వారు తక్షణమే ఉద్యోగాలలో చేరాలని సూచించారు.
ఏర్పాట్లు బేష్…
మేగా జాబ్‌మేళా కోసం హాజరైన నిరుద్యోగ యువతి, యువకులకు తగిన వసతులు కల్పించేందుకు కృషి చేసిన అధికారులకు, పోలీసులకు, పార్టీ నాయకులకు, సిబ్బందికి మంత్రి పెద్దిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఏర్పాట్లు బాగా చేశారని అభినందించారు.
ఉపాధికోసం ఆరాటం…
మెగాజాబ్‌మేళా కోసం వేలాది మంది తరలివచ్చారు. నెలల బిడ్డలను తీసుకుని ఉద్యోగం కోసం తల్లులు తరలిరావడం పలువురిని ఆకట్టుకుంది. అలాగే భార్య ఇంటర్వ్యూకు వెళ్లడంతో చంటిబిడ్డను దగ్గరపెట్టుకుని లాలిస్తున్న తండ్రి. అలాగే ధరఖాస్తులు నింపుతున్న యువతి, యువకులు ఇలాంటి సంఘటనలు జాబ్‌మేళాలో చోటుచేసుకున్నాయి.
ఆకట్టుకున్న మెప్మాబజారు….
మెప్మా మహిళలచే ఏర్పాటు చేసిన వివిధ రకాల తినుబండారాలు, వస్తువుల విక్రయశాలలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఎన్నడు లేని విధంగా జిల్లా పీడీ జ్యోతి, మెప్మా స్టాల్స్ ఇన్చార్జ్ కృష్ణవేణి ఆధ్వర్యంలో మెప్మా బజారును ఏర్పాటు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి సందర్శించి అభినందించారు.
పుంగనూరులో 23న జాబ్‌మేళాను ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి
Tags: The aim is to provide employment to the unemployed in Punganur