Natyam ad

పేద మధ్య తరగతి వారికి సేవలందించడమే లక్ష్యం

డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి

కడప ముచ్చట్లు:

పేద మధ్యతరగతి వారికి సేవలందించడమే లక్ష్యమని ప్రముఖ డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి తెలిపారు ఆదివారం రాజారెడ్డి వీధిలోని పాత గ్రేస్ నిర్మల హాస్పిటల్ లోని నూతనంగా నిర్మించిన కిషోర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ దుగ్గాయిపల్లి మల్లికార్జున్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున్రెడ్డి ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆహార భద్రత చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి లు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి వైద్య వృత్తిని ఎంచుకొని పేదలకు సేవ చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు గత పది సంవత్సరాలుగా జిల్లాలో వైద్య సేవలలో పేరు ప్రఖ్యాతలు గడిచారని తెలిపారు. అనంతరం డాక్టర్ విజయ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ కమర్షియల్ టాక్స్ అధికారి సతీమణి విజయలక్ష్మి సహాయ సహకారాలతో ఇదివరకే జిల్లాలో పోరుమామిళ్లలో వైద్యశాల ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నామని ఇప్పుడు కడపలో నూతనంగా కార్పొరేట్ వైద్యశాలలకు దీటుగా కిషోర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అత్య అధునాతన పరికరాలతో మెరుగైన సౌకర్యాలు కల్పించి 24 గంటలు ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో కి తెచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో సీకే దీన్నే జడ్పిటిసి సభ్యులు నరేన్ రామానుజన్ రెడ్డి, మేడ మధుసూదన్ రెడ్డి, చిత్త ప్రణీత్ రెడ్డి, నగరంలోని పలువురు ప్రముఖ డాక్టర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 

Post Midle

Tags: The aim is to serve the poor middle class

Post Midle

Leave A Reply

Your email address will not be published.