విద్యారంగ సమస్యలు పరిష్కారమే ఆర్ ఎస్ యు లక్ష్యం
-ఆర్ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు రవి శంకర్ రెడ్డి
కడప ముచ్చట్లు:
కడప జిల్లా లో ఆర్ ఎస్ యు జిల్లా మహాసభలు జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ విద్యార్థులకు ధరలకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థులకు అనుకూలంగా మేస్చార్జీలు అందకపోవడం వలన మెనూ సక్రమంగా అమలు కావడం లేదని అందువల్ల విద్యార్థులు అనేక రూపాల్లో ఇబ్బంది పడుతున్నారని వారు తెలిపారు.
విద్య దీవెన వసతి దీవెన విడుదల కాకపోవడం వలన విద్యార్థులు అనేక రూపంలో ఇబ్బంది పడుతున్నారని కాలేజ్ యాజమాన్యాల బెదిరింపులకు విద్యార్థులు బలవుతున్నారని ఇది దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా దీవెన వసతి దీవెన విడుదల చేసి విద్యార్థులకు అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు.

ఈమధ్య కాలంలో జిల్లా వ్యాప్తంగా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుందని మనందరికీ తెలిసిందే కావున గురుకుల పాఠశాలకు సంబంధించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి విద్యార్థులు తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అలాగే ఇక పునర్ ప్రారంభం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి తెలిపారు.
కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీని కొనసాగిస్తున్నాయని. ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ భాష్యం కేశవరెడ్డి వంటి విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. ఈ విద్య సంస్థల ఫీజుల దోపిడీకి అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగ వైఫల్యం చెందింది. విద్యార్థులకు కనీస మౌలిక వసతులు సదుపాయాలైన తాగునీరు. మరుగుదొడ్లు. ఆటస్థలం. వంటివి కల్పించలేకపోగా గ్లోబల్ ప్రచారాలు చేసుకుని తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న అన్నారు కావున అలాంటి పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హరి. అలీ. అఖిల్. నీరజ్. బాబ్జాన్. సందీప్. తరుణ్. తదితరులు పాల్గొన్నారు.
Tags: The aim of RSU is to solve the problems of the education sector
