మ‌హిళా అభ్యున్న‌తే సీఎం ధ్యేయం- సర్పంచ్ శ్రీనాథరెడ్డి

– సీఎం జగనన్నకు మహిళల చల్లని దీవెనలు

రామసముద్రం ముచ్చట్లు:

 

 

మహిళా అభ్యున్నతే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని సర్పంచ్ కొండూరు శ్రీనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక రైతు భరోసా కేంద్రంలో వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఎన్నికల మునుపు సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా మహిళలకు హామీ ఇచ్చిన మేరకు రుణాలు నాలుగు విడతల్లో మాపి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్ రైతు భరోసా ఇలా ఎన్నో రకాల హామీలను తుచ తప్పకుండా నేరేవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. అలాగే యువనేత రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, యువ శాసనసభ్యులు నవాజ్ బాషాల ఆదేశాల మేరకు పార్టీలు, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు బ్యాంకు వడ్డి డబ్బులు ఇవ్వకుండా మోసాగిస్తే… ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వడ్డి డబ్బులు ఖాతాల్లోకి జమ చేస్తున్నారన్నారు. ఈ విధంగా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. అనంతరం దివంగత మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మహిళలు కృతజ్ఞత భావంతో సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షిరాభిషేకం చేసి చల్లని దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలింటర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: The aim of the CM is to promote women – Sarpanch Srinath Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *