రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం

డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్

ధర్మపురి ముచ్చట్లు:


రైతును రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ రైతులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుందని, బ్యాంకులలో రైతులు తీసుకున్న పంట రుణాలను 2 లక్షల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల రోజుల లోపు మాఫీ చేస్తుందని, రైతులకు ఒక సంవత్సరానికి గాను ఎకరాకు 15000/- రూ.లు రైతు బంధు ఇస్తామని, కౌలు రైతులకు కూడా ఎకరాకు 15000/- రూ.లు రైతు బంధు ఇస్తామని, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12000/- రూ.లు ఇస్తామని, ఉపాధి హామీ కూలీలను వ్యవసాయానికి అనుసందానం చేస్తామని, రైతు కూలీలకు రైతు భీమా వర్తింప చేస్తామని అన్నారు.

 

 

Post Midle

వరి ధాన్యానికి క్వింటాలుకు 2500/- రూ.లు, మొక్కజొన్నకు క్వింటాలుకు 2200/- రూ.లు,
మిర్చికి 15000/- రూ.లు,
పసుపుకు 12000/- రూ.లు,
కందులకు 6700/- రూ.లు, జొన్నలకు 3050/- రూ.లు, ఎర్రజొన్నలు 3500/- రూ.లు, పత్తికి 6500/- రూ.లు, సోయాబీన్ కు 4400/- రూ.లు,
చెరుకుకు 4000/- రూ.లు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు‌. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు
ఈ కార్యక్రమంలో పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, బతికపల్లి గ్రామ సర్పంచ్ తాటిపర్తి శోభారాణి, మండల కాంగ్రెస్ పార్టీ  ప్రధాన కార్యదర్శి చాట్ల విజయ భాస్కర్,
కిసాన్ సెల్ అధ్యక్షడు పటేల్ సత్యనారాయణ రెడ్డి, సుంకరి రవి,, యూత్ కాంగ్రెస్ అధ్యక్షడు పురుషోత్తం, అనిల్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ లు అండ్రే సత్యనారయణ రెడ్డి, రామడుగు లింగయ్య, డప్పు పోచయ్య, నాయకులు డప్పు నర్సయ్య, దండవేని రాజుమల్లు, సంకిటి శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు వడ్లూరి ప్రవీణ్ కుమార్, బత్తిని చంద్ర శేఖర్, జీల రాకేష్, బొమ్మగాని జితేందర్ గౌడ్, జిలా తిరుపతి, కాంగ్రెస్ నాయకులు, రైతులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: The aim of the Congress party is to make the farmer the king

Post Midle
Natyam ad