ఆరోపణలు ఆవాస్తవం

Date:19/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
వ్యక్తిగత, రాజకీయ స్వార్థం కోసం తాడిపత్రి మండలం చిన్న పొడమల గ్రామంలోని  శ్రీకృష్ణ మందిరం పై జేసీ దివాకరరెడ్డి బ్రదర్స్  చేస్తున్న దాడులను లో  ప్రబోధ సేవా సమితి,హిందూజ్ఞ్యాన వేదిక  తీవ్రంగా ఖండించింది.   బుధవారం నాడు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్  లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి ప్రతినిధులు  బిజినాయుడు, నర్సింహ రావు మాట్లాడుతూ జేసీ బ్రదర్యస్  ప్రబోధ ఆశ్రమం పైన  వినాయక ఊరేగింపు పేరుతొ ఆశ్రమం పై రాళ్లతో దాడులు జరిపించారని ఆరోపిపంచారు.
ఆశ్రయ భక్తులను భయాబ్రాంతులకు గురిచేస్తూ  అల్లకల్లోలం సృష్టిస్తున్నారని  విమర్శించారు. చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు దశాబ్దాల వారి రాజకీయ చరిత్ర లో జేసీ ఎన్ని అక్తమాల కు పాల్పడ్డాడో అందరికి తెలుసున్నారు.  అదేవిధంగా 40 ఏళ్ల  చరిత్ర ఉన్న ఆశ్రయం పై సీబీఐ  విచారణకు ఆదేశిస్తే నిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి అంశం పారదర్శకంగా ఉందని తెలిపారు. అక్రమాలు ఆరాచకాలు జరుగుతున్నాయని ఆధారాలు లేని దుష్ప్రచారం చేయడం అవివేకమని విమర్శించారు. స్వామి ప్రబోధానంద పెద్ద కుమారుడు బిజెపి పార్టీ లో చేరడాన్ని జీర్ణించుకోలేని జేసీ బ్రదర్స్ ఇలాంటి ఆరాచకాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తరువాత వారు  బషీర్ బాగ్ లోని  బాబు జగ్జీవన్ విగ్రహం ముందు జేసీ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు.
Tags:The allegations are false

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *