The anointing of Sri Sundararajaswamy in Tiruchanur

తిరుచానూరులో శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి అభిషేకం

Date:02/06/2020

తిరుచానూరు ముచ్చట్లు:

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా రెండ‌వ రోజైన మంగ‌ళ‌వారం శ్రీ సుందరరాజస్వామివారికి అభిషేకం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో ఆల‌య ప్రాంగణంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి.ఇందులో భాగంగా మధ్యాహ్నం 2.30 నుండి 4 గంటల‌ వరకుశ్రీ సుందరరాజస్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు అభిషేకం నిర్వహించారు. ఇందులోభాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం ఇత‌ర సుగంధ ద్ర‌వ్యాల‌తో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. కాగా జూన్‌ 3 నుండి 5వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంలో టిటిడి ఆల‌య డెప్యూటీ ఈవో  ఝాన్సీరాణి, ఏఈవో  సుబ్ర‌మ‌ణ్యం త‌దిత‌రులు పాల్గొన్నారు.

పుంగనూరులో రెడ్‌జోన్లు తొలగింపు

Tags: The anointing of Sri Sundararajaswamy in Tiruchanur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *