HC issues notice to five MLAs of Waikapa ...

ఏపీ సర్కారుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు

గ్రానైట్‌ క్వారీల నిర్వాహకులకు జరిమానా

నోటీసులపై హైకోర్టు ఆక్షేపణ

లాక్‌డౌన్‌లోనూ ఇదేంటని ప్రశ్న

వ్యాపారులకు ఊరట

Date:03/05/2020

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

★ గ్రానైట్‌ క్వారీల(ఒంగోలు) యజమానులకు నోటీసుల జారీ విషయమై ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఎదురుదెబ్బ తగిలింది.

★ జిల్లాలో గ్రానైట్‌ వ్యాపారులకు రమారమి రూ. 2500 కోట్ల అపరాధ రుసుం విధిస్తూ గనులు, భూగర్భ శాఖ గతంలో నోటీసులు ఇచ్చింది. వీటిని హైకోర్టు కొట్టివేసింది.

★ అయితే లాక్‌డౌన్‌తో యావత్‌ గ్రానైట్‌ క్వారీలు మూతపడిన నేపథ్యంలో తిరిగి ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీంతో క్వారీ యజమానులు వణికిపోతుండగా, ఒక్కరు మాత్రం ధైర్యం చేసి హైకోర్టును ఆశ్రయించారు.

★ లాక్‌డౌన్‌ వల్ల మొత్తం పరిశ్రమ మూతపడిన నేపథ్యంలో నోటీసులు ఇవ్వడాన్ని ఆ పిటిషన్‌లో సవాల్‌ చేశారు.

★ దీన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు విచారించింది.

★ సదరు గ్రానైట్‌ క్వారీ తరఫున న్యాయవాది తన వాదనలు వినిపించారు.

★ దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయమూర్తి ‘ఇదే విషయంలో గతంలో ఒక తీర్పు ఇచ్చాం, పైగా ప్రస్తుతం లాక్‌డౌన్‌తో పరిశ్రమ మూసివేసి ఉంది. ఇప్పుడు జరిమానాలు విధించడం ఏంటి?’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

★ ఈ నోటీసులకు ఇప్పటికిప్పుడే యజమానులు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

★ లాక్‌డౌన్‌ ఎత్తివేసి పరిశ్రమ గాడిలో పడిన తర్వాత విచారణ చేద్దామ ని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

★ దీంతో జిల్లాలో ప్ర ధానమైన గ్రానైట్‌ పరిశ్రమను దెబ్బతీసే విధంగా సీఎం జగన్‌ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రెండోసారి న్యాయస్థానం బ్రేక్‌ వేసినట్లయింది.

★ అదే సమయంలో గ్రానైట్‌ వ్యాపార, అనుబంధ పరిశ్రమలు, వాటిపై ఆధారపడిన కార్మికులకు ఈ నిర్ణయం కాస్తంత ఊరటనిచ్చింది.

నక్షత్ర తాబేలు అప్పగింత

Tags: The AP government has been re-elected in the High Court

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *