ఏపీ హైకోర్టు నిర్వహణకు అమరావతిలో వసతులు లేవు

The AP High Court has no accommodation in the state of emergency

The AP High Court has no accommodation in the state of emergency

Date:31/12/2018
విజయవాడ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వేర్వేరుగా హైకోర్టులు 2019 జనవరి 1 నుంచి పనిచేస్తాయని గత వారం రాష్ట్రపతి గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, అమరావతిలో ఏపీ హైకోర్టు నిర్వహణకు సరైన వసతులు లేని పరిస్థితులు ఉన్నాయని ఏపీ లాయర్ల అసోసియేషన్ అభిప్రాయపడింది. హైకోర్టు విభజనకు తాము వ్యతిరేకం కాదని, కనీస వసతులు కల్పించిన తర్వాత అక్కడకు తరలించాలని, జనవరి 1 నుంచి కాకుండా మరికొన్నాళ్లు పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో శనివారం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో దీనిపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది.ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదనీ, జనవరి 2న ఇతర వాటితోపాటు సాధారణంగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దీంతో ఉమ్మడి హైకోర్టు విభజనకు మార్గం సుగమం అయింది.
ఇప్పటికే న్యాయమూర్తులు, న్యాయాధికార్ల విభజన పూర్తికాగా, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ జనవరి 1న ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇక, హైకోర్టు విభజనకు కేంద్రం, సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మంగళవారం నుంచి అమరావతిలో సేవలు నిర్వహించాల్సి ఉండటంతో హైదరాబాద్‌ హైకోర్టు వద్ద భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. న్యాయవాదులు, సిబ్బంది, టన్నుల కొద్దీ ఫైళ్లను అమరావతికి తరలించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సోమవారం ఉదయం నుంచే బస్సులు, లారీలతో తరలింపు ప్రక్రియ మొదలైంది. రాజకీయ కారణాలు, సెంటిమెంట్, ప్రత్యేక కోర్టులు పక్కనబెడితే నిన్నటి వరకూ కలిసిమెలిసి ఉన్నవారు విడిపోవడంతో తెలంగాణ, ఆంధ్రా లాయర్లు, సిబ్బంది పలువురు కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ న్యాయమూర్తులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు చెబుతూనే, ఇలా విడిపోవడం తమకెంతో బాధ కలిగిస్తోందని ఏపీకి వెళుతోన్న లాయర్లు, సిబ్బంది అంటున్నారు. ఫైళ్లు, సిబ్బందితో కూడిన వాహనాలు సోమవారం రాత్రికి విజయవాడకు చేరుకోనున్నాయి. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ సహా, పలు భవనాల్లో తాత్కాలిక హైకోర్టు కార్యకలాపాలకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోన్న సంగతి తెలిసిందే.
Tags:The AP High Court has no accommodation in the state of emergency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *