ఏపీకి మాంచి కాంగ్రెస్ లీడర్ కావాలి

విజయవాడ ముచ్చట్లు:

 

 

కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అంటే ఉంది అనే జవాబు చెప్పాలి. ఎన్నికలలో ఈవీఎంలలో కనిపిస్తుంది. అపుడపుడు ఆ పార్టీ నాయకుల ప్రెస్ మీట్లలో, ప్రెస్ నోట్లలో కనిపిస్తుంది. అలా ఏపీ కాంగ్రెస్ ని తయారు చేసిన ఘనత అచ్చంగా అధినాయకత్వానిదే. అహంకారంతో అతి తెలివితో రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని ఈ దశకు తీసుకు వచ్చింది హై కమాండ్. తెలంగాణా ఇచ్చినా కూడా రెండు సార్లు తెలంగాణాలో ఓడింది. ఈసారి అయినా గెలుస్తుంది అన్నది లేదు కానీ కొంతలో కొంత అక్కడ నయం. మరి ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని ఎవరూ కొత్తగా చెప్పనక్కరలేదు.ఏపీలో కాంగ్రెస్ కి కొత్త ఆశలేవీ లేకపోయినా జగన్ మీద మోజు జనాలలో తగ్గితే తమకు అదే రాజమార్గం అవుతుంది అని ఆలోచిస్తోందిట. ఏపీలో జగన్ పవర్ లోకి వచ్చాడు కానీ నమ్ముకున్న రెడ్లకు మాత్రం అన్యాయం జరిగింది. బహుశా ఇదే కాంగ్రెస్ లో కొంత నమ్మకం పెంచి ఉండాలి. కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీగా పేరు. అందువల్ల రెడ్లను మళ్ళీ ఆకట్టుకోవాలని చూస్తోంది అంటున్నారు. తెలంగాణాలో చురుకైన నేతగా రేవంత్ రెడ్డిని తెచ్చిన కాంగ్రెస్ లో ఏపీలో కూడా పగ్గాలు రెడ్డికి ఇవ్వాలని చూస్తోందిట. మరి ఆ రెడ్డి కోసమే సెర్చ్ చేస్తోందని టాక్.తెలంగాణాలో రేవంత్ రెడ్డిని పెట్టడం ద్వారా చంద్రబాబుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు.

 

 

 

 

 

రేపటి రోజున సమీకరణలు మారి చంద్రబాబు బీజేపీ మైకం నుంచి బయట పడితే అటు తెలంగాణా మాటెలా ఉన్నా ఇటు ఏపీలో మాత్రం చేయి కలిపేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందిట. సంధానకర్తగా రేవంత్ రెడ్డి ఎటూ ఉంటాడు. ఇక ఇద్దరికీ ఉమ్మడి శత్రువుగా జగన్ ఉంటాడు కాబట్టి ఈ కలయిక కల మాత్రం కాబోదు అంటున్నారు. పైగా యాంటీ మోడీ కూటమికి 2024 కి ముందు ఒక రూపూ రేఖా వస్తే మాత్రం కచ్చితంగా చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలుపుతాడు అంటున్నారు. అందుకోసమే కొంత బలం పెంచుకోవడానికి ఏపీలో రెడ్లను కాంగ్రెస్ దువ్వుతోంది అంటున్నారు.ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఏపీలో కాంగ్రెస్ బలం అంతా వైసీపీలో ఉంది. ఆ పార్టీ వీక్ అయితేనే కాంగ్రెస్ కి ఉనికీ గుర్తింపూ వస్తాయి. మరి జగన్ నుంచి ఓటు బ్యాంక్ తెచ్చుకోవడం ఎలా. ఇదే కాంగ్రెస్ కి అతి పెద్ద టాస్క్. అయితే జగన్ ఏలుబడిలో చేసిన తప్పులు పొరపాట్లే అస్త్రంగా విరుచుకుపడితే కొన్నళ్ళకు అయినా ఆ ఓట్లు తమ వైపు మళ్ళుతాయని ఆశ. ఇక ప్రత్యేక హోదా ఆయుధాన్ని కూడా బయటకు తీయడం ద్వారా జగన్ మీద వ్యతిరేకత రాజేయాలని కూడా కాంగ్రెస్ కి ప్లాన్స్ ఉన్నాయట. మొత్తానికి ఉమెన్ చాందీ అనే ఆయన ఇపుడు అర్జంటుగా ఏపీ టూర్ వేస్తారట. ఆయన ఎటూ కేళా ఎన్నికలు అయి ఖాళీగా ఉన్నారు కాబట్టి జగన్ మీద గట్టిగా పోరాడే వారిని వెతికి పట్టుకుంటే మాత్రం పీసీసీ చీఫ్ గా ఆయన్ని నియమించడం ఖాయం. అయితే ఆ నాయకుడు రెడ్డి అయితేనే మరీ మంచిది అన్నదే కాంగ్రెస్ ఆలోచన

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags: The AP needs a good Congress leader

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *