Tamilsai as a boon to Kamalani

బీజీపీ కార్యాలయం పై దాడి సరైయినది కాదు

Date:21/11/2020

హైదరాబాద్  ‌ ముచ్చట్లు:

కూకట్ పల్లి  బీజేపీ కార్యాలయం పై జరిగిన దాడిని మేడ్చల్ జిల్లా పార్టీ  అధ్యక్షుడు హరీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.  ఇల్లు లాంటి  పార్టీ కార్యాలయం ను ధ్వంసం చేయడం చాలా బాధాకరమని అయన అన్నారు. అన్ని పార్టీలకు  చెందిన  వాళ్ళు , కేసీఆర్ కుటుంబ పాలన వ్యతిరేకంగా బీజేపీ పార్టీ నుండి పోటీ చేయాలి అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు, కెసిఆర్ పైన టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఆగ్రహంతోనే బీజేపీ నుంచి పోటీ చేయాలని టికెట్ పొందాలని అందరూ అనుకుంటున్నారు.  కెసిఆర్ కి బీజేపీ పార్టీ అయితేనే సరైన సమాధానం చెబుతుందని ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. బీజేపీ పార్టీ టిక్కెట్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీష్ రెడ్డి, వల్లనో బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇవ్వరు.టిక్కెట్ ఇవ్వడం  కోసం 13 మంది తో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు మాత్రమే ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయిస్తారు. టిక్కెట్ అమ్ముకున్నారు అంటూ ఇల్లు లాంటి పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయడం చాలా బాధాకరం. ఎవరికైతే టికెట్ రాలేదు వారందరితో కూర్చొని మాట్లాడి వారిని కలుపుకొని అభ్యర్థి గెలుపుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.ఏ పదవి కూడా ఆశించకుండా పని చేస్తున్న వారు పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తుంది,పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలి హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

సాగ‌ర్‌, శ్రీశైలం మ‌ధ్య లాంచీ ప్ర‌యాణం ప్రారంభం

Tags:The attack on the BJP office was not justified

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *