మున్సిపల్ కమీషనర్ పైన దాడి బాధాకరం- ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య ముచ్చట్లు:


రాయచోటి  మున్సిపల్ కమీషనర్ పై దాడి బాధాకరమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి పైన దాడి చేయడం సమర్ధ నీయం కాదన్నారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగు తుందన్నారు. రాయచోటి పట్టణంలో లే అవుట్ల విషయంలో  గత ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో పట్టణంలోని వీధులన్నీ అస్తవ్యస్తమయ్యాయని, ఆరు అడుగులు, పది అడుగుల  రోడ్లు ఏర్పాటు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా  ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ  ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లే అవుట్ల నిబంధనలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించకపోవడం కొన్ని సనస్యలుకు తావిస్తోందన్నారు. పాత లే అవుట్లను ఏమి చేయలేము కాబట్టి యధాతధంగా, ఎల్ ఆర్ ఎస్ లేకుండానే అనుమతులు ఇస్తున్నారని, నూతనంగా వేసే లే అవుట్ల కు ఖచ్చితంగా నిబంధనలు పెట్టడం మంచిదేనన్నారు. గత సంవత్సరాల క్రితం వేసిన కొన్ని లే అవుట్లలో దాదాపు ఇళ్లన్నీ పూర్తయి,

 

 

 

మిగిలిన స్థలాలకు మొత్తం లే అవుట్లను తీసుకురండని అధికారులు చెప్పడంతో ఒకటి రెండు మిగిలిన స్థలాలకు మొత్తం లే అవుట్ కు మాకు ఏమి సంబంధమనే భావన ప్రజల్లో ఉందన్నారు. అటువంటి వాటికి కొన్ని నిబంధనలను ప్రభుత్వపరంగా సడలిస్తే బాగుంటుందన్నారు. త్వరలో జగనన్న భూహక్కు సర్వే చేస్తున్నారని, అందులో మనకు అప్రూవల్ లే అవుట్లు ఉండి, సరైన రికార్డులు ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని, లేకపోతే ఎన్నేళ్ళు అయినా దానికి శాశ్విత పరిష్కారం జరగదన్నారు. 2019లో ఏర్పాటైన లే  అవుట్ లలో 14 శాతం కట్టించుకుని అప్రూవల్స్ ఇవ్వాలని, అవి కూడా ఇవ్వక పోవడంలో సామాన్యులలో అసహనం పెరుగుతోందన్నారు. జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులు ఇందు విషయంపై చర్యలు తీసుకోవాలని  ఆయన కోరారు. లే అవుట్ ఏర్పాట్ల పై అధికారులు రియల్టర్లకు పూర్తిగా అవగాహన కల్పించాలని ఆయన అధికారులుకు సూచించారు. ఇబ్బందులు, సమస్యలు ఎదురైనప్పుడు పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప ఇలా అధికారులపై దాడులకు పాల్పకూడదని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

 

Post Midle

Tags: The attack on the Municipal Commissioner is painful – MLA Srikanth Reddy

Post Midle
Natyam ad