Natyam ad

అధికారుల తీరు విచారకరం- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి  

– కలెక్టర్ కి పిర్యాదు చేసిన నరసింహ యాదవ్ , బొజ్జల సుధీర్ రెడ్డి , సుగుణమ్మ

 

తిరుపతి ముచ్చట్లు:


ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రేణిగుంట మండలం రామకృష్ణాపురం వద్ద గోదాముల్లో వైసీపీ నేతలు తాయిలాలు దాచిన విషయం టీడీపీ నేతలు బయట పెట్టినా అధికారులు చర్యలు తీసుకోక పోవడం విచారకమని టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేవారు. తిరుపతి కలెక్టరు కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రామకృష్ణాపురం వద్ద నాలుగు గోదాముల్లో వైసీపీ నేతలు తాయిలాలు, ప్రచార సామాగ్రి దాచారన్నారు. ఈ విషయమై తిరుపతి మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, పార్లమెంటు అధ్యక్షులు నరసింహయాదవ్ తో కలసి కలెక్టరు డాక్టర్ లక్ష్మీశ కు ఫిర్యాదు చేశామన్నారు. అయితే కలెక్టరు స్పందన తమకు సంతృప్తి కలిగించలేదన్నారు. తాను మొదటి సారి కలెక్టరుగా వచ్చానని… ఎన్నికల నిబంధనలపై పుస్తకాలు చదువుతూ నేర్చుకుంటున్నానని చెప్పడం బాధాకరమన్నారు. అందుకే ఎన్నికల వేళ తిరుపతికి సీనియర్, అనుభవం ఉన్న కలెక్టరును నియమిస్తే బాగుంటుందని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

 

 

 

Post Midle

మంగళవారం మధ్యాహ్నం డంప్ గుర్తిస్తే 24గంటల తరువాత అధికారులు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అది కూడా ఎన్నికల అధికారులు రాకుండా జీఎస్టీ అధికారును పంపడం ఏమిటన్నారు. జీఎస్టీ అధికారులకు… ఎన్నికల తాయిలాలకు ఏమిటి సంబంధం అని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నిలదీశారు. ఈ విషయమై కలెక్టరును ప్రశ్నిస్తే… సీ యాప్ లో ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే సామాగ్రి, డబ్బు దొరికినపుడు మొదట సీజ్ చేసి… ఆ తరువాత తగిన చర్యలు తీసుకోవాలని ఓ అభ్యర్ధిగా తాను డిమాండు చేస్తున్నానన్నారు. ఒక గోదాము పరిశీలనకే పుణ్యకాలం గడిపేస్తే… మిగిలిన మూడు గోదాములు ఎపుడు తనిఖీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే తాము ఎన్నికల ప్రచారం చేసుకోవాలా..? లేక గోదాము దగ్గర కాపలా ఉండాలో అధికారులు చెప్పాలన్నారు.

 

 

 

ఎన్నికల వేళ మండలానికి ఒకే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ పెట్టడం ఏమిటన్నారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే తమ వద్ద సిబ్బంది లేరని కలెక్టరు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇలా చెప్పడం చాలా విచారకరమన్నారు. తమ పార్టీ నేతలే పట్టుకుని అధికారులకు అప్పగిస్తే… వారు సీజ్ చేయక పోతే తాము ఎవరికి చెప్పుకోవాలన్నారు. ఈ వ్యవస్థ, ప్రభుత్వం ఎలా ఉందో ఈ సంఘటనే నిదర్శనమన్నారు. ఈ తాయిలాలు నిల్వపై ఎన్నికల కమిషనుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పని తాము చేస్తున్నామన్నారు. వ్యవస్థ ఏ విధంగా ప్రజలందరూ ఆలోచించాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంత జరుగుతున్నప్పటికీ శ్రీకాళహస్తి రిటర్నింగ్ అధికారి సరిగా స్పందించక పోవడం బాధాకరమన్నారు. అవసరమైతే రిటర్నింగ్ అధికారిని మార్చాలని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఎన్నికల కమిషనుకు విజ్ఞప్తి చేశారు.

 

Tags:The attitude of the officers is sad – Bojjala Venkata Sudhir Reddy

Post Midle