చిన్నారిని చంపేసిన మేనత్త

హైదరాబాద్ ముచ్చట్లు :

 

అబ్దుల్లాపూర్ మెట్టు పోలిస్ స్టేషన్ పరిధిలోని నిన్న జరిగిన చిన్నారి హత్య కేసు మిస్టరీ వీడింది. అనాజ్ పూర్ గ్రామంలో నిన్న జరిగిన రెండు నెలల బాబు హత్య కేసును పోలీసులు చేధించారు. ఓ మేనత్త తనకు కాకుండా ఆడపడుచుకు పిల్లలు పుట్టడంతో కసితో బాబును చంపేసింది . మేనత్త ఆమె భర్త కలిసి రెండు నెలల చిన్నారి బాబును కిరాతకంగా హత్య చేశారు.స్థానికంగా ఈ సంఘటన ఎన్నో మంది హృదయాలను కదిలించివేసింది. మేనత్త శ్వేత మేనమామ రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. శ్వేతకు పిల్లలు పుట్టక పోవడంతో భర్తతో ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే ఆడపడుచుకు బాబు పుట్టాడు దీంతో శ్వేతకు ఆడపడుచుపై కసి పెరిగింది. ఈర్ష్యతో తనకి పిల్లలు కాకుండా తన ఆడపడుచుకి బాబు పుట్టడంతో ఇంట్లో భర్త రాజుతో కలిసి అదే రోజు రాత్రి గొడవ పడింది. గొడవ అనంతరం మేనత్త శ్వేత అర్ధరాత్రి సమయంలో భర్త రాజు సహకారంతో బాబుని చంపి ట్యాంక్ లో పడేసింది.సొంత వదిననే తన బాబును చంపింది అనే విషయం తెలుసుకున్న బాబు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

పుంగనూరులో క్రాంతివీర కురభ సంఘ రాష్ట్ర ప్రతినిధులుగా గోపాల్‌, యశ్వంత్‌,హేమంత్‌

 

Tags: The aunt who killed the child

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *